సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లోక క‌ళ్యాణం కోసం చేస్తున్న ఈ య‌జ్ఙాన్ని ఎన్ని దృష్ట శ‌క్తులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన అప‌లేరు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లోక క‌ళ్యాణం కోసం చేస్తున్న ఈ య‌జ్ఙాన్ని ఎన్ని దృష్ట శ‌క్తులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన అప‌లేవ‌ని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను డిప్యూటీ సీఎం కొట్టి సత్యనారాయణ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు ఆలయం మర్యాదలతో దర్శనం చేయించారు. అమ్మవారి సన్నిధిలో యాగ‌శాల‌లో చండీయాగం చేయించారు. అనంతరం వీరు లక్ష్మీ గణపతి ఆలయ సమీపంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న పుష్పార్చన పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ క‌న‌క దుర్గ‌మ్మ‌, దుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్తానంలో వ‌సంత న‌వ‌రాత్రులు శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంద‌న్నారు. వ‌సంత న‌వ‌రాత్రులులో రోజు జ‌రిగే చండీ హోమం ద్వారా అమ్మ‌వారు మ‌రింత శ‌క్తి వంతంగా భ‌క్తులు కోరిన కోర్కెల‌న్ని తీరుస్తార‌న్నారు. ఈ రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ది, సంక్షేమ ఫ‌లాలు ఎప్ప‌డు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇలానే అందించాల‌ని కోరుకున్నాన‌న్నారు. ఈ రాష్ట్రంలో ఇదే విధంగా సంక్షేమ ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందితే ప్ర‌తిప‌క్ష‌ నేత‌లు మ‌నుగ‌డ సాగ‌ద‌ని, వారికి స‌హ‌క‌రిస్తున్న కొన్ని ప‌త్రిక‌లు రాక్షస కుట్రలు చేస్తున్నార‌న్నారు. అధర్మంగా నైనను అధికారం చేప‌ట్టాల‌ని ప్రతిప‌క్ష నేత‌లు చూస్తున్నార‌న్నారు. ఈ ప్రతిపక్ష నేతలు దుర్మార్గాల మీద దుర్మార్గాలు చేస్తున్నారు, సరైన ఆలోచనాత్మక ముందుకు వెళ్లాలని ఆలోచన వారికి రావటం లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కి దైవ సంకల్పం మెండుగా ఉంది, ఎవరు ఎన్ని చెడు ప్ర‌య‌త్నాలు చేసిన‌ ఆయన్ని ఏమీ చేయలేరన్నారు. సీఎం జగన్ పరిపాలన ప్రజల స్వాగతిస్తున్నారు.
భక్తులు మనోభావాలు అనుగుణంగా కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో టీటీడీ స్థలాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఇంద్రకీలాదుర్గమ్మ దర్శనానికి వచ్చే వేలాది భక్తులకి వాహనాలు నిలిపేందుకు ఎదురవుతున్న ఇబ్బందిపై త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. టీటీడీ ఈవో, చైర్మన్ తో మాట్లాడి భక్తులకు అణువుగా ఇక్కడ కాటేజీలు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
గొల్లపల్లిలో దేవస్థానం రికార్డులు కాలిపోయిన విషయంపై కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు, దేవదాయ శాఖ‌ ముఖ్యమైన రికార్డులు భద్రంగానే ఉన్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డబ్బు ప్రభావంతోనే ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కించుకున్న ప్రతిపక్షం రాష్ట్రంలో వైకాపా పాలనపై చేస్తున్న విమర్శలు తిప్పుకొట్టారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో సంక్షేమ రాజ్యం నడుస్తుంటే కొన్ని పార్టీలు డబ్బు మదంతో చేస్తున్న విమర్శలు ప్రజలు పట్టించుకోరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో భ్రమరాంబ పాలక మండలి చైర్మన్ రాంబాబు సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *