విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో ప్రజలు సమర్పించిన ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం ఆర్జీదారుల సమస్యల పరిష్కార దిశగా సాగింది. జిల్లా కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ఆర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. స్పందనలో స్వీకరించిన ఆర్జీలపై జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఆర్జీలకు నిర్థీశిత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీలు ఏ స్థాయిలోను పునరావృతం కాకుడదన్నారు. సమస్యల పరిష్కారానికి స్పందన ఎకైక మార్గమని ఆర్జీదారులు ఎంతో ఆశతో స్పందనలో ఆర్జీలను అందజేస్తుంటారన్నారు.వాటిని నిశితంగా పరిశీలించి పరిష్కరించాల్సిన భాధ్యత మనపై ఉందన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యకు సరైన పరిష్కారం చూపగలిగిన్నపుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. సమస్యను పరిష్కరించాలనే ఆలోచన పట్టుదలను అచరణలో పెడితే పరిష్కార మార్గాలు వాటికి అవే లభిస్తాయన్నారు. ఈ దశగా ప్రతి అధికారి ఆలోచించి తమ భాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో 111 అర్జీల నమోదు అయ్యాయని వీటిలో అత్యధికంగా రెవెన్యూ 46, పోలీస్ 18, యంఏయుడి 9, హౌసింగ్ 7, విద్య 6, పౌర సరఫరాలు 4, పంచాయతీరాజ్ 4, సహకార శాఖ 3, దేవాదాయ శాఖ2, ఉపాధి కల్పన 2, కాగా మిగిలినవి వివిధ శాఖలకు చెందినవి 10 గా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. స్పందన కార్యక్రమంలో డిఎస్‌వో పి కోమలి పద్మ, ఐసిడిఎస్ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డ్వామా పిడి జె. సునీత, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్, జిల్లా సర్వే అధికారి కె. సూర్యారావు, డిసివో సిహెచ్ శైలజ, డిఆర్‌డిఏ పీిడి కె. శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి బాలాజీ కుమార్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎస్ నాగమణమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News