జిల్లాలో ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం..

-154 కేంద్రాల ద్వారా 27,171 విద్యార్థులు హాజరు.
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పదవ తరగతి పరీక్షలలు అత్యంత కట్టుదిట్టమైన నడుమ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహిస్తున్నామని 154 కేంద్రాల ద్వారా 27,171 మంది విద్యార్థులు హాజరు అయిన్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు నగరంలోని కర్నాటి రామమోహన్‌రావు, చుండూరి వెంకటరత్నం నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో మొదటి రోజు నిర్వహించిన తెలుగు పరీక్షలకు 154 పరీక్ష కేంద్రాల ద్వారా 27,171 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారని ఆయన తెలిపారు. 27,442 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 271 మంది విద్యార్థులు గైరహాజరు కాగా 99 శాతం హాజరు నమోదు అయిన్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణకు ఐదు ఫ్లైయింగ్‌ స్కాడ్‌లను, పరీక్ష కేంద్రాలకు 1,354 ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. పరీక్షల అనంతర 19వ తేది నుండి 26వ తేది వరకు స్పాట్‌ వాల్యేషన్‌ నిర్వహించేందుకు బిషప్‌ అజరయ్య పాఠశాలను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. పరీక్షల కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్‌ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తుని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలలో నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా రాత్రి వేళలో విద్యుత్‌ సరఫరా చేసేలా విద్యుత్‌ అధికారులకు ఆదేశించామన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఆయా సమయాలలో ఆదనపు బస్సులను ఏర్పాటు చేశామని, హాల్‌టిక్కెట్‌ కలిగిన విద్యార్థులకు ఉచిత ప్రయాణానికి అనుమతించడం జరిగిందన్నారు. పట్టణాలలో మున్సిపల్‌ అధికారులు గ్రామాలలో మండలాభివృద్ధి అధికారులు పరీక్ష కేంద్రాలను నిర్వహించే పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులను అందుబాటులో ఉంచామన్నారు. పరీక్ష కేంద్రాలలోనికి విద్యార్థులు ఎటువంటి మొబైల్‌ ఫోన్‌లను, ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించకుండా అన్ని ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *