స్పందన ద్వారా 14 ఆర్జీలు స్వీక‌రణ, అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలి

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి.
-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారుల‌తో క‌లిసి సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన అర్జిలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొని వచ్చిన అర్జీలు అన్నియు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు. అర్జీదారుని సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కోను ఇబ్బందుల పట్ల అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా , సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగం – 4, పట్టణ ప్రణాళిక విభాగం – 6, పబ్లిక్ హెల్త్ విభాగం – 2, రెవిన్యూ – 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి)- 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, సెక్రటరీ కె. వసంత లక్ష్మి, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, ఎస్టేట్ ఆఫీసర్ కె.అంబేద్కర్, మేనేజర్ బి.శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 3 అర్జీలు
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 1 కార్యాలయంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి)- 1 అర్జీ, సర్కిల్ – 2 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం – 1 అర్జీ, మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1 అర్జీ అందించినారు అని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *