-త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఆదేశాలు,
-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్, సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పార్కులలో జరుగుతున్నవంటివి ఆధునికకరణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. వారధి ప్రక్కన రాణిగారి తోట రిటైనింగ్ వాల్ దగ్గర రిటైనింగ్ బ్యూటిఫికేషన్ పార్కులో జరుగుతున్నవంటివి రోడ్లు మరియు బెస్మెంట్ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి కృష్ణలంక జాతీయ రహదారి ప్రక్కన గల అంబేద్కర్ పార్కును క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పార్కులో జరుగుతున్నవంటివి పునరుద్ధరికరణ పనులను మరియు గ్రీనరీ మొక్కలను పరిశీలించినారు. గ్రీనరీ మొక్కలను ఇంకా పెంచాలని, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ మీదా వేసే టైల్స్ ను పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ లో గల ఐకానిక్ పార్కు పనులను పరిశీలించి ప్రహరీ గోడ నిర్మాణ పనులను మరియు పార్కు ఆవరణలో చేపట్టిన ప్లాంటేషన్ పనులను పరిశీలన చేసి గ్రీనరీ మొక్కలను మధ్యన ఖాళీలు ఉండటం గమనించి ఆ ఖాళీ ప్రదేశములో మొక్కలను నాటలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్లాంట్ ఆవరణలో జరుగుతున్నవంటివి పనులను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, వి.చంద్ర శేఖర్, ఎస్.ఇ నరసింహ మూర్తి, ఏ.డి.హెచ్ శ్రీనివాసు శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News