జగన్ పాలన దేశానికే ఆదర్శం..

-వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా పాలన చేస్తూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన గూడూరులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులను అందించారు. గూడూరు మండలంలోని గూడూరు, జక్కంచెర్ల, కలపటం, ఐదుగుళ్లపల్లి, తరకటూరు, కంకటావ, పిజి లంక, నారికెడ్లపాలెం, చిట్టిగూడూరు, కోకనారాయణపాలెం, తుమ్మలపాలెం గ్రామాల్లోని 371 డ్వాక్రా సహాయక సంఘాలకు 3,686 మంది మహిళా లబ్ధిదారులకు రూ.3.69 కోట్ల చెక్కును మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా నవరత్న పథకాలను అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని అన్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా చూశారని, అందరీ అవసరాలను తెలుసుకుని అధికారంలోకి వచ్చాక చెప్పినవి నెరవేర్చి చూపించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విద్యార్థుల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నారని చెప్తూ నాడు నేడు కార్యక్రమంతో పాటశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారని అన్నారు. ఫ్యామిలీ ఫిజియన్ కాన్సెప్ట్ తో వైద్యాన్ని ప్రజల ఇంటి ముంగిటకు ముఖ్యమంత్రి చేరుస్తున్నారని చెప్పారు. నన్ను గెలిపించి, మంత్రి పదవిలో కూర్చోబెట్టిన మీకు ఎలాంటి సమస్య వచ్చినా తీర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
మంత్రి తనయుడు జోగి రాజీవ్ సైతం పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని, పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వేముల సురేష్ రంగబాబు, ఎంపీపీ సంగా మధుసూధనరావు, మండల పార్టీ అధ్యక్షులు గొరిపర్తి రవి కుమార్, ఎంపీడీవో సుబ్బారావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, సచివాల సిబ్బంది, వాలంటీర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *