బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన హోమంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ. 3 లక్షల చెక్కును మంగళవారం హోంమంత్రి తానేటి వనిత బాధితులకు అందించారు. కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు మండలం చాగల్లు గ్రామానికి చెందిన మాచవరపు వెంకట నాగ భాస్కరరావుకు రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. గత ఏడాది జనవరి నెలలో గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యకుగురైన మాచవరపు సురేష్ (27) కుంటుంబాన్ని ఆదుకుంటూ ఈ ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులా ఆదుకుంటుందని తెలిపారు. కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న తమ కుటుంబాన్ని ఇంటికి పెద్ద కొడుకుగా ఆదుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *