ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు రోడ్ కం రైల్ బ్రిడ్జి పై వాహనాల రాక పోకలు నిలిపి వేత

-రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి పై… హ్యాండ్ రైల్ మరియు ఫుట్ పాత్ ల మరమ్మత్తులు నిమిత్తం
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి పై… హ్యాండ్ రైల్ మరియు ఫుట్ పాత్ ల మరమత్తులు నిమిత్తం ఏప్రిల్ 16 ఆదివారం ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రిడ్జి పై రాకపోకలు నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు.

రైల్వే మరియు ఆర్ అండ్ బి అధికారుల ప్రతిపాదన మేరకు రోడ్ కం రైల్ వంతెన హ్యాండ్ రైలింగ్, పుట్ పాత్ పనులకు సంబంధించి ప్రతిపాదించిన 20 పనులలో 10 పనులను మార్చి 25 న చేపట్టడం జరిగింది. మిగిలిన పది పనులను చేపట్టేందుకు రోడ్ ట్రాఫిక్ ను నివారించేందుకు ఆర్ అండ్ బి , రైల్వే అధికారుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 16 వ తేదీ ఆదివారం  ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి పై ఏ విధమైన వాహనములు అనుమతించ బడవని, ట్రాఫిక్ ఆ సమయంలో మళ్ళిచడం జరుగుతుందని  కలెక్టర్ ప్రజలకు తెలియ చేశారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకి ప్రజలు సహకరించాలని ఆ ప్రకటనలో కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *