రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా లో సవరణలు, మార్పులు చేర్పులు లకు సంబంధించి డిసెంబర్ 26 నాటికి సిద్దం చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.
బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ల తో క్లయిమ్స్ పరిష్కారం, వెరిఫికేషన్, ఫామ్.6 బి, డుప్లికేట్ ఓటర్ల తొలగింపు, రాండమ్ తనిఖీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొమ్మిది అంశాల అజెండా లో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధత, ఓటర్ల జాబితా -;బి ఎల్ ఓ రిజిస్టర్, రాబోయే 2024 సాధారణ ఎన్నికలకు ముందస్తు కార్యాచరణ, రాజకీయ పార్టీలు సమన్వయ సమావేశం, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గం స్థాయి లో పోలింగ్ స్టేషన్ల , ఓటర్ల జాబితా విషయంలో హేతుబద్ధీకరణ విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఓటర్ నమోదు, తొలగింపు పారదర్శకత జవాబుదారీతనం ఉండటం ముఖ్యం అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన విధంగా నమోదు, తొలగింపు ఉండాలని, అసాధారణ స్థాయిలో ఉండే సందర్భంలో పోలింగ్ కేంద్రాల వారీగా మరొక్క సారి పరిశీలన చెయ్యాలని ఆదేశించారు. 2024 సాధారణ ఎన్నికల నిర్వహించే క్రమంలో జూన్ 30 నాటికి సమాన ప్రక్రియ పద్ధతి (SOP) రూపొందించాల్సి ఉంటుందన్నారు .
స్థానిక కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ కె. మాధవీలత జిల్లాలో అత్యంత పారదర్శకంగా ఓటరు జాబితా సిద్ధం చేయడం లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియచేశారు. 2022 అక్టోబర్ నుంచి జనవరి 5 వరకు జిల్లాలో 54,773 మంది ఓటరు నమోదు, మార్పులు చేర్పులు కోసం ధరకాస్తు చేసుకోగా 4386 తిరస్కరించడం జరిగిందని, 49,437 పరిష్కా రం చేశామన్నారు. ఇంకా 948 పరిశీలన లి ఉన్నట్లు తెలిపారు. జనవరి నుంచి మార్చి 2023 వరకు 27,170 దరఖాస్తులు రాగా 17,517 ఆమోదించడం జరిగిందని, 8723 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఓటర్ల కు సంబందించి లాజికల్ ఎర్రర్ గుర్తించామని, వాటిని సరి చెయ్యడం జరుగుతోందని కలెక్టర్ మాధవీలత తెలియచేశారు. 2023 జనవరి 5 వ తేదీ నాటికి ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఓటరు జాబితా పరిశీలన చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎపిక్ కార్డ్ లకు చెంది 29,492 డేటా ఎంట్రీ చెయ్యడం జరిగిందని, వీటిలో 17,440 ఎన్నికల కమిషన్ ద్వారా ప్రాసెస్ చేసి, 15,047 పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాకు చెందిన 240 ఎపిక్ కార్డు లను చిరునామా, తదితర మార్పుల కారణంగా తిరిగి పంపించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్వో జీ. నరసింహులు, నియోజక వర్గ ఎన్నికల అధికారులు అనపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఏబీవీఎస్బి శ్రీనివాస్, రాజమహేంద్రవరం గ్రామీణ కి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి, కొవ్వూరు (ఎస్ సి) కి కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లి బాబు, నిడదవోలు కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు కే. గీతాంజలి, గోపాలపురం (ఎస్ సి)స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ ఏ) ఓ ఎన్ జి సి, రాజమహేంద్రవరం టిఇఎం రాజు, డిప్యూటీ కలెక్టర్ ఏ. కుమార్, తాహసిల్దార్ పవన్ కుమార్, తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News