Breaking News

జిల్లా వ్యాప్తంగా 126 పరీక్షా కేంద్రాల్లో 26,129 విద్యార్థులు

రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా 126 పరీక్షా కేంద్రాల్లో 26,129 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని జిల్లా కలెక్టరు డా. మాధవీలత పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఎస్ కే వి టి పాఠశాలలో జరుగుతున్న 10 వ తరగతి సైన్స్ పరీక్షల విధానాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కలెక్టరు డా కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పదవ పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసామన్నారు. పరీక్షలలో ఎటువంటి మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్, ఎలక్ట్రానికి గాడ్జెట్స్ ను అనుమతిని నిషేదించామన్నారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈరోజు సైన్స్ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కలెక్టరు వెంట విద్యాశాఖ ఎస్. అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *