-ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి స్పందన కార్యక్రమం రేపు యధావిధిగా జరుగుతుందని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్, మండల, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం రూరల్ లో హర్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు ఆయన తెలియచేశారు. రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో స్పందన ఫిర్యాదులు అందచేయాలని ఇంఛార్జి కలెక్టర్ తెలియచేశారు
Prajavartha Online Telugu News