Breaking News

నీతి నిజాయితీకి నిలువటద్దం.. మానవతామూర్తి లింగంశెట్టికి విశిష్ట సన్మానం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అవినీతి రహిత నీతి నిజాయితీ రాజకీయాలలో నిలువుటద్దం గా నిలిచే మానవతామూర్తి లింగం శెట్టి ఈశ్వరరావు చరితాత్ముడంటూ లయన్ నూతలపాటి వీర ప్రకాశరావు నేతృత్వంలో ఏర్పాటైన ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో జరిగిన రాజకీయరంగ స్వర్ణోత్సవ వేడుకల సభలో పలువురు ప్రస్తావించారు. విద్యార్థి దశ… ఆపై ఇందిరాగాంధీ కుటుంబానికి విధేయుడై పెద్దలు దూరమైనప్పటికీ వెన్నంట నిలిచి 1978-82 మధ్యకాలంలో శాసనసభ్యునిగా…. ప్రభుత్వ విప్ గా…. అన్నింటి మించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క గుంటూరు నియోజకవర్గంలో 20వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు…. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను తీసుకువచ్చారంటూ కొనియాడారు. ఎందరో విద్యార్థులు ఆపై యువకులను ఉన్నత స్థాయికి తీసుకురాగలిగారన్నారు.
ఎమ్మెల్సీ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఆ పార్టీ నేతలు షేక్ మస్తాన్ వలి, కొరివి వినయ్ కుమార్, ఆకుల శ్రీనివాస్, కొలనుకొండ శివాజీ, సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు, పారిశ్రామికవేత్త తులసి ప్రభు హ్యూమన్ రైట్స్ కమిషన్ విశ్రాంత చైర్మన్ కాకుమాను పెద పేరిరెడ్డి, జంగాల అజయ్ కుమార్ (సిపిఐ), పాశం రామారావు (సిపిఐ), ఉగ్గిరాల సీతారామయ్య, దాసరి రాము (సిపిఐ), మాధవ రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *