Breaking News

పార్టీలకు అతీతంగా జగనన్న సంక్షేమం డిప్యూటీ సీఎం కొట్టు

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ కులం మతం ప్రాంతం ఇలా అన్నింటికీ అతీతంగా అర్హులందరికీ అందుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలను గ్రామంలో శుక్రవారం రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామంలోని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జడ్పిటిసి అభ్యర్థిగా పోటీచేసిన వడ్డూరి రాంబాబు ఇంటి వద్ద ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంత్రి కొట్టు గడపగడపకు కార్యక్రమంలో భాగంగా టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి ఇంటి వద్ద ఆ కుటుంబానికి వైకాపా ప్రభుత్వంలో జగనన్న సంక్షేమ పథకాలు ద్వారా చేకూరిన లబ్ధిని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూశారుగా వైకాపా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగనన్నకు సంక్షేమ పథకాలు అమలులో పార్టీ కులం మతం ప్రాంతం వంటి ఎలాంటి భేదం లేవన్నారు. అన్నిటికీ అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలనేదే ముఖ్యమంత్రి జగనన్న ఆశయమన్నారు. గడపగడపకు వెళ్లి ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లక్షలాది రూపాయల లబ్ధిని చదువుతుంటే వారు స్వయంగా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని వైకాపా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అన్నారు. రాష్ట్రానికి ఏలినాటి శని లాంటి చంద్రబాబు నవరత్నాలను నవ మోసాలు అంటూ విమర్శించడం చాలా దారుణమని మంత్రి కొట్టు తీవ్రంగా ఖండించారు. రెండుసార్లు రాష్ట్రానికి ఏలినాటి సనిలా 14 ఏళ్ల పాటు పాలించిన చంద్రబాబు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని జగన్ లా నేను ఎందుకు చేయలేకపోయాను అని పశ్చాత్తాప పడితే బాగుంటుందని హితవు పలికారు. అంతేగాని ఇప్పటికీ వయసు మీద పడినా పదవీ కాంక్ష తో చంద్రబాబు పిశాచిలా ప్రజలను పట్టిపీడిస్తున్నాడని మంత్రి కొట్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన పార్టీకి రాజకీయ సిద్ధాంతం లేదని పవన్ కళ్యాణ్ కు గమ్యం లేదని స్థిరమైన అభిప్రాయాలు లేవని ఇటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాణించలేడని ప్రముఖ విశ్లేషకులు చెబుతున్నారు అన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి మర్రిచెట్టు లాంటి చంద్రబాబును విడిచి బయటకు వస్తే భవిష్యత్తు ఉంటుందన్నారు. అంతేగాని చంద్రబాబుతోనే అంటకాగితే తెలుగుదేశంతో పాటు జనసేన అడ్రస్ కూడా గల్లంతుకావడం ఖాయమని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరుగొలను గ్రామంలో ఆయన గడపగడపకు వెళ్లి ఆయా కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం ద్వారా జగనన్న సంక్షేమ పథకాలతో చేకూరిన ఆర్థిక లబ్ధిని గణాంకాలతో సహా చదివి వినిపించారు. ఏ ప్రభుత్వంలో మేలు జరిగింది ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది అనేది ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *