Breaking News

రోగులకు మరింత మెరుగైన సేవలు డిప్యూటీ సీఎం కొట్టు

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ఏరియా ఆసుపత్రి కార్యకలాపాలపై మంత్రి కొట్టు సమీక్షించారు. దీనికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ ఇంచార్జ్ ఆర్ ఎం ఓ డాక్టర్ నాయక్ హాజరయ్యారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన పది పడకలతో కూడిన చిన్నపిల్లల స్పెషల్ వార్డు ఎస్ ఎన్ సి యు పూర్తయిందని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కోటి 40 లక్ష రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేస్తున్న జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ పూర్తి కావచ్చిందన్నారు. త్వరలోనే వీటిని రోగులకు అందుబాటులోకి తీసుకు రావాలని మంత్రి ఆదేశించారు. ఖాళీగా ఉన్న శానిటేషన్ సూపర్వైజర్ పోస్టు భర్తీ చేయడంతో పాటు సెక్యూరిటీ గార్డ్ పోస్టుకూడా త్వరలోనే భర్తీ చేయాలని సూచించారు. ఆసుపత్రి పురోభివృద్ధికి ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొండి బకాయిలు వసూళ్లకు చొరవ చూపించాలన్నారు. ఇప్పటికే నాలుగున్నర లక్షల రూపాయలు వసూలు చేశామని మరో నాలుగున్నర లక్షల రూపాయలు వసూలు చేయవలసి ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్య నారాయణ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ జి ఆర్ రెడ్డి విరాళంతో ఆసుపత్రికి రెండు ఫ్రీజర్ బాక్సులు సమకూరాయని వీటిని త్వరలోనే ఉచిత సౌకర్యార్థం అంకితం చేయనున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం త్వరలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యనారాయణ ను ఆదేశించారు. వివిధ రకాల వైద్య సేవలో ఆసుపత్రి ప్రగతిని మంత్రికి నివేదించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *