జగనన్న విద్య కానుక పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలి… : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పాఠశాలల పున:ప్రారంభం ఈ నెల 12 న సోమవారం జగనన్న విద్య కానుక పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణా రెడ్డి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో విద్యకానుక పంపిణీ చేపట్ట నున్నారని , జిల్లాలో మండల విద్యాశాఖాధికారులు వారి పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యకానుక కిట్ల పంపిణీ కి ప్రజా ప్రతినిధు లు, పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లి దండ్రులు హాజరయ్యేలా చూడాలని అన్నారు. ఇప్పటికే క్వాలిటీ చెక్ జరిగిందని, నాణ్యతలేని, డ్యామేజ్డ్, మిస్ మ్యాచ్ మరియు డిఫెక్టివ్ వస్తువులను పంపిణీ చేయరాదని అన్నారు. పంపిణీ సమయంలో లోపాలు వుంటే వాటి స్థానంలో కొత్తవి పంపిణీ చేసే లా చూడాలని అన్నారు. జిల్లాకు అందిన విద్యాకానుక వస్తువులు ఒకటవ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులు 1,66, 659 మందికి 3 జతల యూనిఫామ్, 1 నుండి 5 వ తరగతి ఆడపిల్లలకు , 1 నుండి 10 తరగతి మగపిల్లలకు కలిపి 121648 మందికి బెల్టు లు, 1 వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరి లు 13957, 6 వ తరగతి విద్యార్థులకు Oxford డిక్షనరి లు 19380, 6 నుండి 10 తరగతి వారికి నోట్ బుక్ లు 945828 , ఒకటవ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులు 1,66, 659 మందికి షులు, సాక్సు లు , 1 నుండి 5 వ తరగతి విద్యార్థులకు 297605 వర్క్ బుక్ లు, , 1 నుండి 10 వ తరగతి విద్యార్థులకు 1192038 టెక్ట్స్ బుక్ లు, 1,66, 659 మందికి స్కూల్ బ్యాగుల పంపిణీ జరిగేలా చూడాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *