రాష్ట్రానికి రాజకీయ గ్రహణం పట్టింది… : రామచంద్ర యాదవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవతరించబోతోందని పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఒక ఫంక్షన్ హాల్లో ఆదివారం కీలక ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోరిక మేరకు కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రాజకీయ గ్రహణం పట్టిందని ఎవరు అధికారంలో వున్నా ఏదో ఒక వర్గం వెనుకబాటుకు గురవుతూనే ఉందన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో వున్నా అన్ని వర్గాలకూ అన్యాయమే జరిగిందన్నారు. ఇందుకు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అతీతం కాదని, గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలోని రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వ్యవసాయాన్ని వదిలి వలసలు వెళ్లే పరిస్థితి నెలకొందని, వ్యవసాయం పేరు చెప్పి అధికారంలో ఉన్నవాళ్లు దోపిడీ చేస్తున్నారన్నారు. రైతులకు ఎవ్వరూ మేలు చేసిన దాఖలాలు లేవన్నారు. నైపుణ్యం కలిగిన ఆంద్ర యువత ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ చూపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఉపాధి లేక అల్లాడే పరిస్థితి ప్రస్తుతం కనబడుతుందన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా అని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు జరిగిన దోపిడీని కొత్త పార్టీ బట్టబయలు చేస్తోందని, వైసీపీ, టీడీపీ రాజకీయ పార్టీల నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కావాలన్నారు. ఆవిర్భావ సభ జూలై 23న నాగార్జున వర్సిటీలో ప్రజా సింహ గర్జన పేరుతో నిర్వహిస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారన్నారు. టీడీపీపాలనలో కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని ఏ వర్గ అభ్యున్నతి కోసం ఆ పార్టీ పాటుపడలేదని విమర్శలు చేశారు. రౌడీ, హత్యా రాజకీయాలు ఫ్యాక్షన్ పార్టీ వైసీపీ అని, ఆ పార్టీ ఏర్పాటు, అది అధికారంలోకి రావడం దురదృష్టం అని మండిపడ్డారు. దశాబ్దాల రాజకీయ గ్రహణాన్ని వదిలించి, నవ శకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వచ్చే నెల 23న నిర్వహించే ప్రజా సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *