ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు పొడిగింపు

-పాఠశాల విద్య కమీషనర్ ఎస్.సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం రోజుల పాటు ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా. పాఠశాల బోధనా సమయం: ఉదయం 7:30 నుండి 11:30 వరకు. రాగి జావ: ఉదయం 8:30 నుండి 9:00 వరకు. మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *