జూలై 8న ఎస్టీ ఉద్యోగుల సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అఖిలభారత ఆదివాసి ఉద్యోగుల సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీ ఆదివాసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకోవడం జరిగిందిఅని , జూలై 8న జరగబోయే ఎస్టి ఉద్యోగుల సమ్మేళన కరపత్రాన్ని ఆదివారం స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆవిష్కరించడమైనది. ఈ సందర్భంగా ఎస్టీ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదివాసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను సంఘ నాయకులు కలిసినప్పుడు సరైన హామీలు లభించడం లేదన్నారు. కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు కనీసం ఉద్యోగ సంఘ నాయకులకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదని వెంకటేశ్వర్లు విచారం వ్యక్తం చేశారు . తదనంతరం పలువురు ఎస్టీ నాయకులు మాట్లాడుతూ, తోటి ఉద్యోగుల పట్ల అనుచితంగా వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎస్టీ మహిళ ఉద్యోగులపై వివిధ రూపాల్లో జరుగుతున్న దాడులు అన్యాయాలపై సంబంధిత డిపార్ట్మెంటులో అధికారులు న్యాయ పరంగా స్పందించాలన్నారు ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలలో జరిగిన బదిలీల్లో అనేకచోట్ల ఎస్టి ఉద్యోగులకు అన్యాయం జరిగిందని అన్నారు . శాఖపరమైన పదోన్నతుల్లో రిజర్వేషన్ అమలుపరిచెక్రమంలో ఎస్టీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఆడక్వసి రిచ్ అనే పదాన్ని జీవో నెంబర్ 2 నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆమోదం పొందిన ప్యానెల్ లిస్టులను ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు వెరిఫై చేసుకోవడానికి అనుమతించాలని కోరారు పదోన్నతులు కల్పించి ముందు డిపార్ట్మెంట్లో నిర్వహించే సమావేశాలకు ఎస్టీ ఉద్యోగులు సంఘం నాయకులకు ఆహ్వానించాలని ప్రభుత్వానికి కోరారు.
ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, కోరారు. . ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలని సచివాలయ ఉద్యోగులు సమస్యలను, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కొమరగిరి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు దేవరకొండ సాంబశివరావు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కోతాడి శివ బాల నాగరాజు ,పాలపర్తి బాలాజీ, దేవరకొండ సురేష్ , నల్లగొండ రామయ్య, ఎస్టీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *