“జగనన్న సురక్ష” కార్యక్రమం సందర్భంగా ఆకస్మిక తనిఖీ

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జగనన్న సురక్ష” కార్యక్రమం సందర్భంగా కొవ్వూరు మండలం కాపవరం గ్రామం లో వాలంటీర్లు చేస్తున్న ఇంటింటి సర్వే ను రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్ . మల్లి బాబు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. వాలంటీర్లు ఇంటింటి సర్వేలో ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు వారికి వివరించి ప్రతి ఒక్కరికి అవి చేరుకుంటున్నాయా లేదా , వారికి ఏమైనా సేవలు అవసరమయి ఉన్నావా అను విషయములు తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. కులదృవీకరణ పత్రంలు , ఆదాయ ధృవ పత్రములు , వివాహ ద్రువపత్రములు, పెన్షన్, తదిదర సర్వీస్ లు అవసరమయిన యెడల వారి అభ్యర్ధన లు స్వీకరించి టోకెన్ నంబర్ లు జారీ చేయడం జరుగుతుందన్నారు. తదుపరి గ్రామ సభ జరిగే రోజున ప్రజలు/ లబ్ధిదారులకు సదరు దృవపత్రములు ఉచితముగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు . ఇంటింటి త్వరిత గతిన జవాబు దారి తనంతో కూడి పూర్తి చేయాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *