-డివిజన్, మండల ప్రత్యేక అధికారిచే వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం
-అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించాలి
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సురక్ష కింద ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు సేకరించిన డేటాని మండల, మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్స్, మండల స్థాయి అధికారులు వ్యక్తిగత పర్యవేక్షణ లో సంక్షిప్తం చేసి, గ్రామ సభ జరిగే రోజున సంబంధిత అర్జిల పరిష్కారం పత్రం అందచేసే విధంగా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదేశించారు.
ఆదివారం జగనన్న సురక్ష పై క్షేత్ర స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ తో కలిసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించగా, క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జగనన్న సురక్ష కోసం వచ్చే ఆదాయం మరియు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ల సేవా అభ్యర్థనల కోసం, ఇప్పటికే సర్టిఫికేట్ జారీ చేయబడి ఉంటే, ఎపి సేవలో తిరిగి జారీ చేసే ఎంపికను ఉపయోగించాలని అన్నారు. ఇంటింటి సర్వే సమయంలో మీ పరిధిలో ఉన్న పంచాయతీ సిబ్బంది ద్వారా జగనన్న సురక్ష కు సంబంధిచిన సమాచారం ముందస్తుగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
వాలంటీర్ అప్లికేషన్ లో జగనన్న సురక్ష సర్వే షెడ్యూల్ నమోదు చెయ్యవలసి ఉంటుందని స్పష్టం చేశారు. వాలంటీర్ జగనన్న సురక్ష సర్వే చేసి, ప్రజలకు అవసరమయ్యే సర్వీసులు గుర్తించి వాటికి సంబందించిన డాక్యుమెంట్స్ అర్జి దారుని నుంచి సేకరించాలన్నారు. ఏవైనా డాక్యుమెంట్స్ లో సందేహాలు ఉంటే సచివాలయం ను సంప్రదించాలని, అధికారులు ద్వారా జారీ చేయ్యల్సి ఉంటే చర్యలు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఆ క్రమంలో వాలంటీర్ లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ తయారీ లో సహకారం అందించి మార్గ నిర్దేశనం చెయ్యాల్సి ఉంటుందని మాధవీలత ఆదేశించారు.
డిజిటల్ అసిస్టంట్ లాగిన్ లో సర్వీస్ కూడా ఇవ్వాలి కనుక టోకెన్ జారీకి మిగిలిన లాగిన్లు అనగా (WEA/VRO/PS) లకు ప్రాధాన్యం ఇవ్వల్సిఉంటుందన్నారు.
జగనన్న సురక్ష క్యాంప్ లో ఆధార్ సేవలు*
జగనన్న సురక్ష క్యాంప్ లో ఆధార్ డ్రైవ్ కూడా జరుగుతుందన్నారు. ఇందులో ఆధార్ కార్డ్ లో మొబైల్ అప్డేట్, తప్పని సరి బయోమెట్రిక్ అప్డేట్ మాత్రమే ఉచితంగా అందించబడతాయని తెలిపారు. ఆధార్ సెంటర్ ఉన్న డిజిటల్ అసిస్టంట్ లకు అన్ని క్యాంప్ లకు డ్యూటీలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. రోజూ విడిచి రోజు క్యాంపు నిర్వహించే విధంగా షెడ్యూల్ రూపొందించినట్లు తెలియచేశారు.
జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయి లో వాలంటీర్ అప్లికేషన్ లో సర్వే మాత్రమే జరుగుతుందన్నారు. లబ్దిదారులు కావలసిన సర్వీసులు గుర్తించి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ సమగ్ర పరిచి డిజిటల్ అసిస్టంట్ లేదా వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టంట్ లేదా గ్రామ రెవెన్యూ అధికారి లేదా పంచాయతీ కార్యదర్శి వారి ఏపీ సేవ పోర్టల్ లో టోకెన్ జారీ చేయాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అన్నారు. ప్రతి సర్వీసుకు ఒక టోకెన్ జారీ అవుతుందని, టోకెన్ జారీ అయిన తరువాత డిజిటల్ సహయకుల లాగిన్ లో సర్వీస్ అప్లయ్ చేయాలని, ఇప్పటికే టోకెన్ జెనరేట్ అయ్యి ఉంటే సర్వీస్ ఛార్జ్ లు ఉండవని తెలిపారు. ప్రభుత్వం 11 సేవలకు సేవా రుసుము వసూలు చేయడం లేదని, ఆ క్రమంలో సిసిఆర్సి కార్డులను చేర్చినట్లు తెలిపారు. టోకెన్ జారీ, సర్వీస్ రిక్వెస్ట్ గ్రామ సభ షెడ్యూల్ తేదీకి వారం ముందు సిద్దం చేసి, సర్టిఫికెట్స్ క్యాంప్ జరిగే రోజున ముద్రతపత్రం ఇవ్వాలన్నారు .
టెలి కాన్ఫరెన్స్ లో అన్ని స్థాయి లో ఉన్న జిల్లా, నియోజక వర్గ, డివిజన్, మండల స్థాయి, ప్రత్యేక అధికారులు, అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News