కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ సిటీ ఛైర్మన్ కురుమదాసు సూరిబాబు ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు నగర అధ్యక్షులు శ్రీ నరహరిశెట్టి నరసింహారావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇంచార్జ్, ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాథం  సమక్షంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నగర ఛైర్మన్ కురుమదాసు సూరిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి.

కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరమని కేవలం కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని రక్షించగలదని, కాంగ్రెస్ పార్టీతోనే దేశ ఐక్యత సాధ్యమని కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అన్ని కులాలు మతాలు అభివృద్ధిని సాధిస్తాయని, దేశంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువులను ధరలను తగ్గించి కర్ణాటక, హిమాచల్, రాజస్థాన్, మరియు చత్తీస్గడ్ రాష్ట్రాల తరహా పాలన భారతదేశం మొత్తం అందిస్తారనే నమ్మకంతో పార్టీలోకి చేరటం జరిగిందని అన్నారు.

వి.లక్ష్మి, కె.రాంబాబు, కె.శివ, కె.జగన్, ఎం.అప్పలరాజు, కె.రాఘవ, ఐ.శివ నాగరాజు, కె.శ్రీను, డి.జాన్ పాల్, ఎం.లక్ష్మణ్, కె.గోవింద్, ఎం.జగన్నాథం, జి.రమణ తదితరులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎస్.కె.అన్సారి, ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *