అర్జిల పరిష్కారం నాణ్యతతో కూడిన పనితీరు చూపాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సురక్ష నమోదు ప్రక్రియ, స్పందన, జేకేసి అర్జిల పరిష్కారం నాణ్యతతో కూడిన పనితీరు చూపాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి స్పందన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, జగనన్న సురక్ష కింద ఇంటింటి సర్వే నిర్వహించే క్రమంలో ఆయా వాలంటీర్లు తో కూడి సచివాలయ వార్డు కార్యదర్శిలు ఖచ్చితంగా హజరవ్వాలని ఆదేశించారు. ఆర్ ఎం సి పరిధిలో ప్రజల నుంచి జనన మరణ , పత్రం, వివాహ ధృవీకరణ కోసం ఎక్కువ అర్జీలు రావడం జరుగుతుందని అన్నారు. సర్వే సమయం లో సేవా వినతులకు చెందిన టోకెన్ జారీ ఖచ్చితంగా చెయ్యాల్సి ఉంటుందన్నారు.96 సచివాలయాల పరిధిలో ఈరోజు ఏ సచివాలయం వద్ద గ్రామ/వార్డు సమావేశం నిర్వహిస్తున్నామో షెడ్యూల్ ఇవ్వడం జరిగిందన్నారు. షెడ్యూల్ తేదీన సేవా వినతులకు సంబందించిన ద్రువపత్రాలు అంద చెయ్యడం జరగాలని స్పష్టం చేశారు. ఆ ప్రక్రియలో భాగంగా ప్రింటింగ్ సౌలభ్యం కోసం సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలి. జగనన్న సురక్ష గ్రామ సభ జరిగే ప్రాంగణంలో రెండు మూడు సచివాలయాల కు చెందిన కార్యక్రమం నిర్వహిస్తున్న దృష్ట్యా అక్కడ ఆరు ప్రింటర్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. వార్డు సభ జరిగే రోజు మేరకు కార్యాచరణ ప్రణాళిక ముందస్తుగా సిద్దం చేసుకోవాలని సూచించారు. టికెట్స్ ఎన్ని ఇవ్వడం జరిగిందని, వాటిలో ఎంతమందికి ధృవ పత్రాలు జారీ చేయనున్నమో డేటా కూడా ప్రత్యేక అధికారులు వద్ద సిద్దంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు స్పందన లో 19 అర్జీలు రావడం జరిగిందని, వాటిని సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ డీ సి ఎం. సత్య వేణి,  ఎస్ ఈ జీ. పాండురంగ రావు, సిటీ ప్లానర్ వైబిఆర్ చంద్రబోస్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *