-యువ న్యాయవాదులకు తొలి మూడు సంవత్సరాలు అండగా ఉంటూ, ఊతం అందిస్తూ… కలెక్టర్ మాధవీలత, ఎంపి ఎమ్. భరత్ రామ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా “వైఎస్సార్ లా నేస్తం” ద్వారా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ. 5 వేలు చొప్పున 2023 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 5 మాసాలకు సంబందించి రూ.6.13 కోట్లు మేర లబ్దిని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి వారి ఖాతాలకు జమ చేశారని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ పేర్కొన్నారు.
సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెలగపూడి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో “జగనన్న లా నేస్తం” కార్యక్రమం ప్రారంభించగా, స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేమందిరం నుంచి జిల్లాలో స్థాయి ” వైఎస్ఆర్ లా నేస్తం” కార్యక్రమంలో కలెక్టర్ మాధవీలత, ఎంపి భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత,. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, పాల్గొన్నారు. అనంతరం చెక్కును లబ్ధిదారులకు అందచేశారు.
ఈ సందరర్భంగా ఎంపి మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ 2022- 23 చివరి త్రై మాసానికి 2023- 24 సంవత్సరానికి చెంది ఏప్రిల్, మే నెలలకు మొదటి విడత వైఎస్సార్ లా నేస్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ. 5,000 స్టైఫండ్ చొప్పున ఫిబ్రవరి, 2023 జూన్, 2023 (5 నెలలు) వరకు రూ.25,000 ఇస్తూ, మొత్తం రూ. 6,12,65,000 ను బటన్ నొక్కి నేరుగా లబ్దిదార జూనియర్ న్యాయవాదులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానం లో బ్యాంకు ఖాతాకు జమ చేశారని పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ. 100 కోట్లతో “అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్” ను ఏర్పాటు చేసిందన్నారు. న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాల కోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల ఆర్థిక సహాయాన్ని జగనన్న ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత మాట్లాడుతూ న్యాయవాదిగా నమోదు చేసుకున్న యువ న్యాయవాదులకు ప్రతి నెలా రూ.5 వేలు చొప్పున మూడు సంవత్సరాలపాటు ఆర్థిక సహాయం అందచెయ్యడం జరుగుతుందన్నారు. ఈ విడతలో భాగంగా జిల్లాలోని 133 మంది న్యాయ వాదులు 5 నెలలకు చెంది రూ.33.25 లక్షల ఆర్థిక ప్రయోజనం జమ చెయ్యడం జరిగిందన్నారు. వారిలో జిల్లాకు చెందిన 32 మంది ఎస్సీ లు, 41 మంది బిసి లు, 56 మంది ఓసి లు, నలుగురు ఎస్టీ లకు “జగనన్న లా నేస్తం” కింద ప్రయోజనం చేకూరడం జరిగిందన్నారు.
కొత్తగా “లా గ్రాడ్యుయేషన్” పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ ను మన ప్రభుత్వం అందిస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు.
జిల్లా డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ, జగనన్న లా నేస్తం కింద నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,781 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగేళ్లలో మొత్తం రూ. 41.52 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అర్హత మేరకు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
న్యాయవాదుల స్పందన:
యువ న్యాయవాది పి. జగజ్జీవన్:
కొలమూరు గ్రామానికి చెందిన యువ న్యాయవాది పి . జగజ్జివన్ మాట్లాడుతూ, వైయస్ఆర్ లా నేస్తం కింద అందచేస్తున్న రు.5 వేల స్టైఫండ్ ఎంతో ఉపయోగం పడుతుందని అన్నారు. ఈ పథకం పట్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నామని , సిఎం కు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తలో ఎటువంటి ఆదాయం ఉండదని ఈ సమయంలో ఈసొమ్ము ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. నా తల్లిదండ్రులపై భారం కాకుండా న్యాయవాద వృత్తి కొనసాగింపు కోసం ఈ మొత్తం ఉపయోగ పడుతుందని, సిఎం జగన్ మోహన్ రెడ్డి కి మా యువ న్యాయవాదుల తరపున కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి లో న్యాయ సేవలు అందించే సామర్థ్యం పెంచుకునేందుకు న్యాయ సేవా భవనాల కోసం 100 గజలు స్థలం ఇవ్వాలని కోరారు.
యువ న్యాయవాది ఎమ్.శేషు కుమార్ :
వైయస్ఆర్ లా నేస్తం మాలాంటి యువ న్యాయవాద వృత్తిలోకి వస్తున్న యువతను ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. నా వృత్తి పరంగానూ, పుస్తకాలు కొనడానికి, పేదల కోసం నా వంతుగా కేసు నమోదు సమయంలో సహాయం చేసేందుకు ఉపయోగ పడుతుందన్నారు
యువ న్యాయవాది యాగ దీపిక :
రాజమహేంద్రవరం మల్లిఖార్జున నగర్ కి చెందిన యువ న్యాయవాది సునీత మాట్లాడుతూ, కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చే వారికి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ లా నేస్తం కింద ప్రతి నెలా 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. ఆ మొత్తం మా వృత్తికి చెందిన వ్యక్తిగత ఖర్చులకు, రవాణా, పుస్తకాలు కొనుగోలు కు చేదోడు వాదోడుగా నిలిచిందని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
సీనియర్ న్యాయవాది వివి ఎస్ బి రాజు
సీనియర్ న్యాయవాది వివి ఎస్ బి రాజు మాట్లాడుతూ, 25 సంవత్సరాల క్రితం మేము కొత్తగా వృత్తిలోకి వచ్చిన సమయంలో ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ప్రాక్టీస్ కోసం 20 నుంచి 25 కిమి దూరం ప్రయాణం చేసి కోర్టు కి హాజరవుతుండే వారమన్నారు. ఆ రోజుల్లో మాకు ప్రభుత్వ పరంగా గానీ, కోర్టుల ద్వారా గానీ, మా సీనియర్ న్యాయవాదుల ద్వారా కానీ ఎటువంటి చేయూత ఉండేది కాదన్నారు. నేడు జగనన్న రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న ” లా నేస్తం ” యువ న్యాయవాద కు భరోసా వృత్తిలోకి వొచ్చే ఎంతో ఆర్ధిక భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వి. వేణుగోపాల రావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ఎమ్. సందీప్ , జిల్లా బిసి సంక్షేమ అధికారి పి ఎస్ రమేష్ , జిల్లా రవాణా అధికారి జివి కృష్ణారావు, డి ఐ వో బి. వేంకటేశ్వర రావు, సిపివో ఏ. ముఖ లింగం, టిడ్కో అధికారి పి.రీటా, డి ఎ వో ఎస్. మాధవ రావు, జిల్లా కార్మిక అధికారి బీఎస్ఎం వలి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లక్ష్మి రమణి, న్యాయ వాదులు వై అశోక్ కుమార్, పి వివిఎస్బి రాజు, పి. జగజ్జివన్, ఏం ఎస్ కుమార్, వై. దీపిక, పలువురు న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News