రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజానగరం నియోజకవర్గంలో రూ.6.19 కోట్ల రుడా నిధులతో వివిధ దశలుగా ప్రతిపాదించబడిన పలు అభివృద్ధి కార్యక్రమాలు. నేడు కోరుకొండ మండలం లో పూర్తి కాబడిన అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవనీయులైన రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్ తో కలిసి కోరుకొండ మండలం లో గుమ్ములూరు గ్రామం లో పాపిడి ట్యాంక్ అభివృద్ధి పనులకు, కోరుకొండ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం యందు కోనేరు వద్ద స్థానపు ఘాట్ అభివృద్ధిని పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. కోరుకొండ మండలం లో బూరుగుపూడి, శ్రీరంగపట్నం, గదరాడ గ్రామాలలో ఓపెన్ జిమ్స్ ను ప్రారంభోత్సవం చేసారు.
రాజానగరం ఎమ్మెల్యే రాజా పేర్కొన్న ప్రతిపాదన మేరకు కోరుకొండ మండలం లో బూరుగుపూడి, శ్రీరంగపట్నం, గదరాడ గ్రామాలలో ఓపెన్ జిమ్ లను ఆమోదించడం జరిగినదని షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. ఒక్కొక్క ఓపెన్ జిమ్ కు రూ.20.30 లక్షలు రుడా నిధులతో ఏర్పాటు చేసి, ఈ జిమ్స్ లో 9 రకాల ఆధునికరమైన జిమ్ పరికరాలను, చుట్టూ జి.ఐ.మెస్ తో ఫెన్సింగ్ ను, అనువైన సింథటిక్ గ్రాస్ ను, రెస్ట్ తీసుకోవడానికి ఎమ్.ఎస్.సీటింగ్ బెంచీలను, సోలార్ లైటింగ్ ను ఏర్పాటు చేయించామన్నారు. అలాగే గుమ్ములూరు గ్రామంలో పాపిడి ట్యాంక్ నందు వాకింగ్ ట్రాక్, లెవెలింగ్, రెవిట్మెంట్ పనులకు రూ. 30.50 లక్షలు మరియు కోరుకొండ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం యందు కోనేరు వద్ద లెవెలింగ్, రెవిట్మెంట్ మరియు ఘాట్ అభివృద్ధి పనులకు రూ.50.00 లక్షలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగినదని తెలియపరిచారు. ఈ సందర్భంగా రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాచే చేసిన ప్రతిపాదనల మేరకు రాజానగరం నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం గ్రామములో బర్డ్స్ పార్క్, సీతానగరం, కోరుకొండ, దివాన్ చెరువు జాంక్షన్స్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అలాగే రుడా పరిధిలోని గల అన్ని నియోజకవర్గాలలో కూడా రుడా ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా వైస్-చైర్ పర్సన్ బి. బాలస్వామి, రుడా సెక్రటరీ శైలజవల్లి , రుడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (FAC) టి. చంద్రశేఖర రావు , తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News