గ్రామవార్డు సచివాలయాల ద్వారా అందించే ఆధార్‌ సేవల పై డిజిటల్‌ అసిస్టెంట్లు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ఐవిప్యాలెస్‌ నందు సోమవారం ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లాలకు చెందిన గ్రామ వార్డు సచివాలయాల డిజిటల్‌ అసిస్టెంట్లకు ఆధార్‌పై ఒక రోజు శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 176 మంది గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన డిజిటల్‌ అసిస్టెంట్లు ఆధార్‌కు సంబంధించిన పలు రకాల సేవలను అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారులకు డైరక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా వారి ఖాతాలకు నగదు జమ చేస్తున్నారన్నారు. డిజిటల్‌ అసిస్టెంట్లు కొత్తగా ఆధార్‌ నమోదు చేసే సమయంలో ఎటువంటి తప్పలు దొర్లకుండా జాగ్రత్త వహించడం ద్వారా భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తవన్నారు. కొత్తగా ఆధార్‌ నమోదు, మార్పులు, చేర్పులకు బయోమెట్రిక్‌, ఐరిష్‌ ద్వారా జరుగుతుందని భవిష్యత్‌లో ఫేషియల్‌ రికగ్నీషన్‌ ద్వారా కూడా నమోదు చేయవలసి ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కావడంతో ఆయా శాఖల అధికారులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సులువుగా ఆ సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు అందుబాటులో ఉందన్నారు. ముఖ్యంగా రెషన్‌, పెన్షన్‌, నగదు బదిలీ తదితర ప్రజా అవసరాలకు సంబంధించి ఆధార్‌లో పేరు తప్పుగా నమోదు కావడం, పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబర్‌, చిరునామా, జండర్‌ సరిచేసుకునే అవకాశం వుందన్నారు. వీటికి సంబంధించి డిజిటల్‌ అసిస్టెంట్లు ఆధార్‌ను సవరించవలసి ఉంటుందన్నారు. పుట్టిన వెంటనే ఆధార్‌ నమోదు చేసేలా అవగాహన కలిగి ఉండాలన్నారు. పుట్టిన తేదిని ఒకసారి మాత్రమే, పేరు మార్పుకు రెండు సార్లు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం వుంటుందన్నారు. చిరునామ మార్పుకు అడ్రస్‌ ఫ్రూప్‌ తప్పని సరి అన్నారు. చిన్నారుల ఆధార్‌కు 5 సంవత్సరాలు తరువాత, 15 నుండి 17 సంవత్సరాల మధ్య కాలంలో బయోమెట్రిక్‌, ఫింగర్‌ ప్రింట్‌ అప్‌డేట్‌ తప్పనిసరిగా చేయించాలని, ఆధార్‌కు సంబంధించి సమర్పించే డాక్యుమెంట్లను జాగ్రత్త చేసుకోవాలని కలెక్టర్‌ డిజిటల్‌ అసిస్టెంట్లకు సూచించారు.శిక్షణ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారిని కె. అనురాధ, యుఐడిఏఐ ప్రధాన కార్యాలయ శిక్షకులు టివిఎస్‌సి శ్రీనివాస్‌రావు, రీజనల్‌ ఆఫీస్‌ హైదరాబాద్‌ మేనేజర్లు జావీద్‌, గిరిధర్‌ డిజిటల్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *