మానసిక దివ్యాంగుల పట్ల ఓర్పు సహనంతో ప్రేమానురాగాలు చూపుతున్న తల్లిదండ్రులు దైవ సామానులని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు పేర్కొన్నారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ఎం కె బేగ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ వేదికగా నేషనల్‌ ఇన్‌ట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ అఫ్‌ ది పర్సన్స్‌ విత్‌ డిజిబిల్టీస్‌, మినిస్ట్రీ అఫ్‌ సోషల్‌ జస్టిస్‌ మరియు ఎంపవర్మెంట్‌ గవర్నమెంట్‌ అఫ్‌ ఇండియా వారి సౌజన్యంలో జిల్లాలోని మానసిక దివ్యాంగులకు తల్లిదండ్రుల ద్వారా టీచింగ్‌ మరియు లెర్నింగ్‌ కిట్ల పంపిణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు పాల్గొని కిట్లను దివ్యాంగుల తల్లిదండ్రులకు అందజేసారు.ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ పిల్లల కంటే మానసిక దివ్యాంగుల ఆలోచన శక్తి తక్కువగా ఉంటుందని, వీరిని పెంచి పెద్దచేయడం గొప్ప ఓర్పు సహనంతో కూడిన నిరంతర సేవా కార్యక్రమం వంటిదన్నారు. వీరికి టీచింగ్‌ మరియు లెర్నింగ్‌ కు అవసరమైన కిట్లను సామాజిక న్యాయం, సాధికారత అనే భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అందించడం అభినందనీయమని కిట్లలో పిల్లలకు చదువు నేర్పేందుకు తల్లిదండ్రులు ఉపయోగించే విధంగా యంత్ర పరికరాలతో పాటు వాచ్‌, సెల్‌ ఫోన్‌ ఉంటుందన్నారు. వీటిని తల్లిదండ్రులు మానసిక దివ్యాంగులకు ఇంటి వద్ద విద్య నేర్పించడానికి ఉపయోగించి సద్వినియోగపరచుకోవాలని, వీరికి విద్య నేర్పించటానికి మండలానికి ఏర్పాటైన భవిత సెంటర్లు, సెంటర్‌ కి ఇద్దరు ఉన్న ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్సెర్స్‌ పర్సన్లు (ఐఇఆర్‌పి) సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు అన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి సీవి రేణుక మాట్లాడుతూ జిల్లాలో మానసిక దివ్యాంగులు 1,471 మంది ఉన్నట్లు గుర్తించమన్నారు. సామాజిక న్యాయం, సాధికారత అనే భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ద్వారా 329 మంది మానసిక దివ్యాంగుల కొరకు 32 లక్షల 90 వేలు రూపాయలతో ఒక్కొక్కటి 10 వేల విలువగల కిట్లను మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో మండల వారిగా అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ జి వై. మహేశ్వరావు, సమగ్ర శిక్ష ఐఇడి కో-ఆర్డినేటర్‌ ఎల్‌. వెంకటేశ్వరరావు, ఎన్‌ఐపిఐడి వకేషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ యం. శ్యామ్‌, సిఆర్‌సి ఓరియంటేషన్‌ ఒబిలిటీ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ వర్లే, ఎంకెబేగ్‌ స్కూల్‌ ప్రధానోపాద్యాయులు పి. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *