-మిరాకిల్ వెకేషన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కాలంలో రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు, దేశాలకు తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలు, వ్యాపారపరమైన పర్యటనలు చేసేవారి సంఖ్య పెరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. నగరంలోని సీతా అపార్ట్మెంట్ మురళి ఫార్చ్యూన్ రోడ్ లో ఆదివారం ఢిల్లీ ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తున్న మిరాకిల్ వెకేషన్స్ శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ ద్వారా పర్యటించే పర్యాటకులను అన్ని ప్రాంతాలలోనూ సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈ తరహా వ్యాపారంలో విశ్వసనీయత ముఖ్యమన్నారు. ప్రధానంగా ఇతర దేశాలలో పర్యటించే సమయంలో వారికి అవసరమైన రవాణా, భద్రత, వసతి ఏర్పాట్లు, ఆకర్షణీయ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో సంస్థ సిబ్బంది ఆయా ప్రాంతాలలో ఉండే వాస్తవిక పరిస్థితులను పర్యాటకులకు తెలియజేయలన్నారు. తద్వారా సంస్థతో వారికి మరింతగా అనుబంధం పెరుగుతుందన్నారు. దశల వారీగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలన్నారు. వ్యాపారంతో పాటు పర్యాటకుల నమ్మకం చూరగొనడమే లక్ష్యంగా సంస్థను నిర్వహించాలని కలెక్టర్ ఢిల్లీ రావు కోరారు. మిరాకిల్ వెకేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పూసల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో తమ సంస్థ ఇప్పటికే పర్యాటకులకు పలు ప్యాకేజీల ద్వారా సేవలందిస్తుందని, నేడు విజయవాడలో ప్రారంభమైన సంస్థ ద్వారా పర్యాటకులకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు.
Prajavartha Online Telugu News