Breaking News

భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్ర లో అల్లూరిసీతారామ రా జు ఒక మహోజ్వల శక్తి…

-రాష్ట్ర హోమ్ మంత్రి డా. తానేటి వనిత

కొవ్వూరు, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత స్వాతంత్రో ద్యమ చ రిత్ర లో అల్లూరిసీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని రాష్ట్ర హోమ్ మంత్రి డా. తానేటి వని త అన్నారు. మంగళవారం  కొవ్వూరు మండ లం దొమ్మేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్బంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి వనిత మాట్లాడుతూ సాయు ధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి, దాని కొర కే తన ప్రాణాలర్పించిన యోధుడని అన్నారు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యు లు, నిరుపేదలు, అమాయకు లు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరు లతో బ్రిటీషు సామ్రాజ్యాన్నే మహాశక్తి ని ఢీకొన్న పోరాట యోధుడు అని కొనియాడారు. విప్లవ వీరు డు, పోరాట యోధుడు, ఉద్యమకారుడు, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాటం లో ప్రత్యేక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. వారి జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా, ఆశయంగా తీసుకొని యువత ముందడుగు వెయ్యాలని పిలుపునిచ్చి, ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో మన్యం జిల్లా కి అల్లూరి సీతా రామరాజు జిల్లా గా ముఖ్య మంత్రి వై. ఎస్. జగ న్ మోహన్ రెడ్డి నామకారణం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ముదునూరి నాగరాజు, సర్పంచ్, తానేటి కుమారి, సుంకర సత్య నారా యణ, యం. డి. ఓ, కె. సుశీల, బండి పట్టాభి రామారావు, ముదునూరి సూర్య నారాయ ణ రాజు, ని యం. ఈ. ఓ. లు, జె. కెంపు రత్నం, కె. కిషోర్, కొవ్వూ రు మండల తాహిసీల్దార్ డి. టి. కె. అజయ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *