Breaking News

కూరగాయలను తక్కువ ధరకే అందించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు బజార్ల ద్వారా వినియోగదారులుకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకే అందించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌ ఎస్టేట్‌ అధికారులను ఆదేశించారు. రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు అందిస్తున్న సేవలపై శుక్రవారం నగరంలోని జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయ ఛాంబర్‌లో మార్కెటింగ్‌, ఎస్టేట్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలలోని 8 రైతు జజార్లతో పాటు జిల్లాలోని 14 రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందిస్తున్నామన్నారు. రైతుబజార్లలో దళారీ వ్యవస్థను సహించేది లేదని ఆయన అన్నారు. రైతు బజార్లలో వినియోగదారులకు త్రాగునీరు, టాయిలెట్లవంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యంగా వాహనాల పార్కింగ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళే విధంగా చూడాలని, చెత్తను ఎప్పటికప్పుడు తరలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బహిరంగ మార్కెట్లలో టమాట ధరలు 1కిలో రూ. 100కిపైగా ధర ఉన్నందున వినియోగదారులకు తక్కువ ధరకే రైతు బజార్ల ద్వారా 1కిలో 50 రూపాయలకే సబ్బిడీ పై అందిస్తున్న అమ్మకాలపై ఎటువంటి ఫిర్యాధులు రానీయరాదన్నారు. ప్రభుత్వం మదనపల్లి, పలమనేరు ప్రాంతాల నుండి కిలో 100 రూపాయల వరకు కొనుగోలు చేసి తక్కువ ధరకే అందిస్తూ సబ్బిడీని మార్కెటింగ్‌ శాఖ భరిస్తుందన్నారు. రైతు బజార్లలో షాపుల కేటాయింపు, నిబంధనలకు లోబడి జరగాలన్నారు. కేటాయింపులో ఎటువంటి విమర్సలు రాకూడదని, రైతు బజార్లను ఎస్టేట్‌ అధికారులు తమవిగానే భావించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వారి మన్నలను పొందాలని జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ అన్నారు. సమావేశంలో మార్కెంటింగ్‌ శాఖ సహాయ సంచాలకు కె. మంగమ్మ, జిల్లాలోని రైతుబజార్ల ఎస్టేట్‌ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *