-జిల్లా జాయింట్ కలెక్టర్ డా.పి.సంపత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను శుక్రవారం జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ లబ్దిదారునికి అందించాలన్నదే ప్రభుత్వ ద్యేయం అన్నారు. అర్హత ఉన్నప్పటికి పలు కారణాలతో లబ్ది అందని వారు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్న క్యాంపులలో అవసరమైన దృవ పత్రాలను పొందవచ్చునన్నారు. జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంభ వివాహ దృవీకరణ పత్రాలు, సిసిఆర్‌సి కార్డులు, మొబైల్‌కి ఆధార్ అనుసందానం, కొత్త రేషన్ కార్డు లేదా కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాలు, వివరాలలో మార్పులు, చేర్పులు వంటి 12 రకాల దృవపత్రాలను ఉచితంగానే అందజేస్తున్నారన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో నిర్వహిస్తున్న క్యాంపుల ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలిపి పరిష్కరించుకోవచ్చునని జాయింట్ కలెక్టర్ పి. సంపత్‌కుమార్ అన్నారు. పరిశీలనలో జాయింట్ కలెక్టర్ వెంట విజయవాడ రూరల్ తహాశీల్థార్ జాహ్నవి, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News