-జిల్లాలో 19,087 మంది రైతులకు రూ. 392.20 లక్షలు ఉచిత పంటల బీమా పరిహార లబ్ది..
-కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పధకం ద్వారా జిల్లాలో 19,087 మంది రైతులకు 392.20 లక్షల రూపాయల బీమా పరిహార లబ్ది చేకూరనున్నదని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధముగా ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా అంత్యంత సులువుగా కేవలం ఈ పంట నమోదుతో ప్రతి కమతాకు ఉచిత పంటల బీమా పధకం లబ్ది చేకూర్చే వెసులుబాటును కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ (ఎస్‌ఎల్‌సిసిసిఐ) సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆయా పంట కాలాల్లో ఎంపిక చేయబడిన ప్రాంతాలలో నోటిఫై చేయబడిన పంటలకు దిగుబడి ఆధారంగా బీమా యూనిట్ ( ఇన్సూరెన్స్ యూనిట్) అని వ్యవహరించే ‘‘ఏరియా అప్రోచ్’’ ప్రాతిపదికన ఈ పధకం అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గతంలోలాగా కాకుండా రైతులపై ఎటువంటి బీమా ప్రీమియం భారం పడకుండా రైతుల పెట్టుబడికి ధీమా కల్పిస్తూ, ప్రకృతి వైపరీత్యాలు, చీడ పీడలు, అననుకూల వాతావరణం వంటి ప్రతికూల పరిస్తితుల వలన హామి దిగుబడి కన్నా తక్కువ దిగుబడి వచ్చిన పంటలకు ఉచిత పంటల బీమా కల్పిస్తూ, బీమా పరిహార సొమ్ము సంబంధిత రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ఖరీఫ్ 2022 సీజన్ లో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని నోటిఫై చేయబడిన వరి పంటకు, మండలము యూనిట్ గా నోటిఫై చేయబడిన వర్షాధారిత ప్రత్తి, నీటి పారుదల క్రింద సాగు జరుగుతున్న మిరప, జిల్లా యూనిట్‌గా నోటిఫై చేయబడిన మొక్కజొన్న, పెసర పైర్లకు పంట కోత ప్రయోగాల దిగుబడుల ప్రాతిపదికన ఉచిత పంట బీమా పధకం వర్తింపచేయబడిరదన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీ శనివారం ‘‘రైతుదినోత్సవం’’ గా ప్రకటించి రాష్ట్రమంతటా వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలో బాగంగా గత ఖరీఫ్ 2022 సీజన్ కు సంబంధించి రైతులకు లబ్ధి చేకూర్చే డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా – ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పధకం (దిగుబడి ఆధారిత పథకం) క్రింద బీమా పరిహారాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించనున్నారన్నారు.
నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయ ఆవరణంలోని రైతు శిక్షణ కేంద్రంలో శనివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పాల్గొనే కార్యాక్రమాన్ని వర్చువల్‌గా వీక్షించి అనంతరం జిల్లాలోని 19,087 మంది రైతులకు రూ. 392.20 లక్షలు ఉచిత పంటల బీమా పరిహారపు చెక్కును అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News