స్మైల్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్మైల్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం అజిత్ సింగ్ నగర్, కరెంట్ ఆఫీస్ దగ్గర ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో స్థానికులు చిన్నపిల్లలతో కలిసి పెద్ద ఎత్తున పాల్గొని ఉచితంగా షుగర్, బీపీ, జనరల్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ డి సి హెచ్ డి ఎన్ బి వైద్య నిపుణులు డాక్టర్ రాజేకర్ బాబు మాట్లాడుతూ స్మైల్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరమును నిర్వహించామని పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వివిధ రకాల చికిత్సలు నిర్వహించామని తెలిపారు. తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వెసులుబాటు ఉందని రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యమును అందిస్తున్నామని తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం తమ ఆసుపత్రి నందు అనేక సదుపాయాలు కల్పించామని వివరించారు. తమ వద్ద పిడియాట్రిక్స్, గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్ సదుపాయాలు ఉన్నాయని కావున ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *