Breaking News

అలయన్స్ క్లబ్ ఆఫ్ రమాదేవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు దంత పరీక్షలు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అసోసియేషన్ ఆఫ్ అలయాన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 225 ఎస్ అలయన్స్ క్లబ్ ఆఫ్ రమాదేవి క్లబ్ అధ్యక్షురాలు అలై ఎం శోభారాణి, ఆధ్వర్యంలో అలయన్స్ వారోత్సవాలు భాగంగా ఐదవ రోజు మంగళవారం రాణిగారితోట లోని శ్రీ ఎక్స్లెంట్ బాల ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలకు ఉచిత డెంటల్ క్యాంపు ను నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్యాబినెట్ ట్రెజరర్ అలై టీ ప్రసాద్ గుప్తా, ఆర్ సి అలై టి రాధా, హాజరై డెంటల్ క్యాంపులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దంతాలను ప్రతి ఒక్కరూ అశ్రద్ధ చేయకూడదని చిన్న నాటి నుండే పిల్లలకు వారి తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని దంతాల విషయంలో ఎప్పటికప్పుడు సంబంధిత డాక్టర్స్ ని సంప్రదించి దంత సంరక్షణ గురించి ఆలోచించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో డిస్టిక్ వీఆర్వో పి శ్రీనివాసరావు, హాసి ని డెంటల్ కేర్ డాక్టర్స్ సాయి ప్రకాష్, లక్ష్మీ ప్రియాంక, స్కూల్ యాజమాన్యం, క్లబ్ సభ్యులు పడమట రమణారావు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *