విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల మధ్యవిద్వేషాలను రెచ్చగొట్టడానికి ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకువస్తుందని దానిని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్లిం ఐక్యవేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఈనెల 28న భారత్‌బంద్‌కు పిలుపు నిచ్చామని ప్రజాస్వామిక వాదులు ప్రజాసంఘాల నేతలు, ఆలోచనాపరులు పాల్గొని విజయవంతం చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం గాంధీనగర్‌ని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు స్వేచ్ఛా, సమానత్వం, సోదరభావాలను క్రూరంగా అణిచివేస్తున్న మోదీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తేవడానికి చేస్తున్న ప్రయత్నాలు అభ్యంతరకరమన్నారు. ఈక్వాలిటీని సాధించకుండా యూనిపార్మిటీని రుద్దడం రాజ్యాంగ ఆదర్శాలకు విరుద్ధం అన్నారు. దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు, ఆర్ధిక మాంద్యాన్ని అదుపుచేయలేని ప్రభుత్వం ప్రజల దష్టిని మళ్ళించ డానికి మతరాజకీయాలకు పాల్పడుతున్నదన్నారు. వివిధరాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న బిజెపి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి అసందర్భంగా ఉమ్మడి పౌరస్మృతిని ముందుకు తెస్తున్నదన్నారు. ఎన్నికలకు ముందు హిందూ- ముస్లిం విభజన అంశం ముందుకు తెచ్చి ప్రచారాస్త్రంగా మార్చడం బిజెపి సాంప్రదాయమని విమర్శించారు. ఎంతో వైవిధ్య పూరితమైన సాంస్కృతిక సాంప్రదాయాలున్న మన దేశంలో కులం, మతం, తెగ, సమూహాలన్నింటిని సంప్రదించి వాళ్ళ సూచనలు ఆమోదాల మేరకే ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించారని సూచించారు. బలవంతంగా రుద్దితే ప్రజలు వ్యతిరేకిస్తారన్నారు. ఉమ్మడి పౌరస్తృతి శ్రేయస్కరం కాదన్నారు. మన రాష్ట్రంలో జగన్మోహన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకం అని కేంద్రానికి స్పష్టం చేయాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకొక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు ముస్లీం నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News