
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సినీ నటులు ఎస్వీ రంగారావు 50వ వర్ధంతి కార్యక్రమం సితార సెంటర్, వంగవీటిమోహనరంగారావు సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పౌరాణిక, సాంఘిక పాత్రలలో నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా చిరస్థాయిగా నిలిపోయిన మహోన్నత నటుడు ఎస్వీ రంగారావు అని అన్నారు. ఏపాత్రలోనైనా ఆమోఘమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి సుమారు వందకు పైగా చిత్రాలు నటించారని తెలిపారు. అపూర్వమైన నటనతో తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ఘనత ఎస్వీ రంగారావు అని కొనియాడారు. తన నటన ద్వారా అబాలగోపాలన్ని ఎంతగానో అలరించిన ఎస్వీ రంగారావుకు యావత్ తెలుగు ప్రజలందరూ, కళాకారులు ఇప్పటికి ఆయన అభిమానులన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారులు ఆగురు త్రినాథ్‌నాయుడు, ప్రముఖ గాయకులు మద్దుల శ్యామ్‌ప్రసాద్, శ్రీరంగ భువన విజయం సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు, జనసేన నాయకురాలు తిరుపతి అనూష, తిరుపతి సురేష్, పసుపులేటి కృష్ణ, సుధా, బత్తుల సూరిబాబు, మహేశ్వరి, ఉమామహేశ్వరరావు, త్రినాథ్, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News