కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపి వారిలో సంతృప్తి స్థాయి పెంపొందించేందుకు జగనన్నకు చెబుదాం అమలు చేస్తున్నట్లు డిఆర్ఓ వెంకటరమణ పేర్కొన్నారు.”జగనన్నకు చెబుదాం” మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం శుక్రవారం స్థానిక దానా శక్తి ఆర్యవైశ్య భవనంలో డిఆర్వో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు “జగనన్నకు చెబుదాం” కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో ప్రతి బుధవారం, శుక్రవారం మండల స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు కోడూరులో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పరిష్కారానికి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో మాట్లాడి, సెల్ఫీ తీసుకుని, తగిన విచారణ నిర్వహించి, నిబంధనల మేరకు పరిష్కారం చూపడమే లక్ష్యమన్నారు.ప్రజలందరికీ మంచి చేకూర్చడమే లక్ష్యమన్నారు.ఈరోజు 55 అర్జీలు అందాయని, తెలిపారు.కోడూరు మండలంలో జగనన్నకు చెబుదాం పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలన్నారు.మండలంలో జగనన్నకు చెబుదాంలో రీ ఓపెన్ అసంతృప్తి కేసులలో సంబంధిత అధికారులు తీసుకున్న చర్య నివేదిక సమావేశంలో వివరించారు.జగనన్నకు చెబుదాం పెండింగు కేసులు అన్నీ కూడా వెంటనే విచారించి సరైన సమాధానం పంపాలన్నారు.జగనన్నకు చెబుదాం”అర్జీలు మండలంలో వి కొత్తపాలెం గ్రామం మధ్యనుండి వెళుతున్న 5వ ఛానల్ కాలువ కుడి, ఎడమ గట్లను ఆక్రమించారని, సర్వే చేయించి ఆక్రమణలు తొలగించాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ సమర్పించారు. పోటుమీద గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చెరువు తవ్వించి, తాగునీటి సరఫరా ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ సమర్పించారు.అర్జీల నమోదుకు ప్రత్యేకంగా కంప్యూటర్లతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అర్జీదారులు కోసం కుర్చీలు ఏర్పాటు చేసి త్రాగునీటి సౌకర్యం కల్పించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలు ప్రదర్శించారు.మండల తాసిల్దారు ఎంపీడీవో కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు.జడ్పీ సీఈవో జ్యోతి బసు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ బి శివ నారాయణ రెడ్డి, డి ఆర్ డి ఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్, ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ, డిపిఓ నాగేశ్వర నాయక్, డిసిఒ ఫణి కుమార్, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News