Breaking News

మచిలీపట్నం వైద్య కళాశాలలో చదవడం ఎంతో గొప్ప అనుభూతి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య విద్యార్థిగా జీవితం ప్రారంభించడం అంటే అంత తేలికైన విషయం కాదు.. ఆడుతూ పాడుతూ కళాశాల జీవితం ఇక్కడ ఏమాత్రం ఉండదు. ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం వైద్య విద్యార్థిగా, నిరంతర అధ్యయనం, ప్రొఫెసర్లతో మర్యాదగా నడుచుకోవడం క్రమశిక్షణతో కూడిన జీవనం, ఆలుపెరగకుండా పుస్తకాలలో మునిగి తేలిపోవాలి, అలాగే ప్రయోగశాల ప్రాజెక్టులు, శిక్షణ, పరీక్షల కోసం నిత్యం సిద్ధం కావడం మరోవైపు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వైద్య వృత్తిలో రాణించేందుకు ఫస్ట్ ఇయర్ నుంచే విజయ బాటలు వేసుకోవాలివాస్తవానికి, వైద్య విద్యార్థి జీవితం ఆనందదాయకంగా ఏ మాత్రం ఉండదు అనేది నిజం. రేయింబగళ్ళు నైపుణ్యాన్ని పెంచుకుంటూనే వైద్య విద్యార్థి శ్రమిస్తూ ఉంటాడు వైద్యో నారాయణ హరి అనే మాటలు అర్థం చెబుతూ తన కెరీర్లో ఎందరో జీవితాలను రక్షించడానికి వైద్య విద్యార్థులు కృషి చేస్తుంటారు.మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో తొలి ఏడాది మొదటి దశ అడ్మిషన్లు పూర్తయిసరికి 150 మంది విద్యార్థులు గాను 112 మంది విద్యార్థిని విద్యార్థులు మెడికల్ కాలేజ్ లో చేరారు. వీరిలో కొందరి అభిప్రాయాలను సేకరిస్తే వారు చెప్పిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. 1) రాఖి చౌదరి:విజయవడలో ఉండి చదువుకున్నానని అయితే తన స్వంత రాష్ట్రం రాజస్థాన్ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలతో’ ఈ ఏడాది ఓపెన్ క్యాటగిరిలో నాకు సీటు లభించిందని తనకు నీట్ ఎగ్జాం లో వచ్చిన మార్కులు 590 అని చెప్పారు. తాను ఒక మంచి డాక్టర్ కావాలనే బలమైన ఆకాంక్షతో నీట్ ఎగ్జామ్ కు ఎంతో శ్రద్ధతో సిద్ధమయ్యాను. నా కష్టానికి తగినట్లుగా మంచి ఫలితం దక్కింది. మచిలీపట్నంలో అత్యంత ఆధునికంగా నిర్మించబడిన ప్రభుత్వ వైద్య కళాశాల గూర్చి విన్నాను. ఇక్కడ నేను మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ లో చేరడంత ఎంత సంతోషాన్ని కల్గిస్తుంది. ఇంతటి చక్కని కాలేజ్ సమకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాను కృతజ్ఞతలు తెలియజేసినట్లు ఆమె తెలిపింది. 2) గుణ్ గుణ్.:తాను హర్యానా రాష్ట్రానికి చెందిన యువతనని తెలిపారు. తనకు ఆల్ ఇండియా కోటాలో తనకు మచిలీపట్నం ప్రభుత్వ వైద్యకళాశాలలో సీటు వచ్చిందని చెబుతూ, చక్కని ఆహ్లదకరమైన వాతావరణం, అధునాతనమైన వసతులు.. చక్కని ఫ్యాకల్టీ ఇక్కడ లభించడంతో ఒక మంచి వైద్యురాలిగా తాను ఇక్కడి నుంచి అభివృద్ధి చెందగలనని నమ్మకం ఏర్పడుతుందని ఆమె తెలిపారు 3.సచిన్ దాందియా:రాజస్థాన్ లోని జైపూర్ సమీపం లేని ఒక చిన్న జిల్లాకు చెందిన యువకుడిని. అత్యంత ఆధునికమైన సౌకర్యాలు హంగులతో నూతనంగా నిర్మించబడిన మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో తాను ఒక మెడికల్ విద్యార్థిగా భాగస్వామి కావడం ఎంతో సంతోషం కల్గిస్తుందని తెలిపాడు. ఈ కళశాలలో చక్కని ఆహారం మెరుగైన వసతులతో కూడిన భవనాలు, మంచి ఫ్యాకల్టీ, కంటికి రెప్పలా చూసుకునే సిబ్బంది ఉన్న ప్రాంతంలో తన ఎంబిబిఎస్ విద్యను ప్రారంభించడం ఎంతో సంతృప్తి కలుగుతుందని తెలిపారు. మొదట్లో తాను ఇక్కడకు తన తండ్రితో కలిసి వచ్చానని, తమ రాష్ట్రానికి ఎంతో దూరంలో ఉన్న మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకోవడం తమ తల్లిదండ్రులకు కొంత నచ్చలేదని, ధైర్యం చేసి తాను ఈ వైద్య కళాశాలలో చేరిన తర్వాత ఈ ప్రాంతం, అభిమానించే ప్రజలు, లభ్యమవుతున్న సౌకర్యాలు ఇవన్నీ తనని ఎంతో ఆకర్షించినట్లు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప వైద్య కళాశాలలో ఫస్ట్ బ్యాచ్ విద్యాంగా నిలిచిపోవడం ఎంతో గొప్ప అనుభూతి అని సచిన్ అన్నారు. తొలి విడతగా ఐదు మెడికల్ కళాశాలలు నిర్మించి తనకు ఇటువంటి అపూర్వ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మహన రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినట్లు చెప్పారు. 4. వేము పవన్:తాను ప్రకాశం జిల్లాలోని అద్దంకి ప్రాంతానికి చెందిన విద్యార్థినని చెప్పారు. తనకు మచారపట్నం ప్రభుత్వ వైద్యకశాత ఎంబిబిఎస్ సీటు రావడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. మొదట్లో తాను నూతన వైద్యకళాశాలతో చేరేందుకు కొంత సంశయించానని, వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తన ఉత్కంఠకు తెరపడిందని చెప్పారు. మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ఆధునికమైన సౌకర్యాలు, వసతి ఏర్పాటు ఎంతో సంతృప్తి కలిగిస్తుందని, ఏకాగ్రతతో చదువుకునేందుకు సరిపడా చక్కని వాతావరణం ఇక్కడ ఒక ప్రత్యేకత అని పవన్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యవిద్యను ఎంతో ప్రోత్సహించి ఎందరో విద్యార్థిని విద్యార్థులను డాక్టర్లగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా తనలాంటి మధ్యతరగతి విద్యార్థి డాక్టర్ గా ఎదిగేందుకు అవసరమైన మెడికల్ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేయడం ఒక తెలుగు విద్యార్థిగా తనకు ఎంతో గర్వకారణం అన్నారు. తనకు ఎంతో ప్రేరణ కలిగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, తాను ప్రతిభ కలిగిన డాక్టర్ గా ఎదిగి మనదేశంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తానని పవన్ చెప్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *