Breaking News

మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో కృష్ణాజిల్లాకు ఒక చురుకైన కదలిక ప్రారంభం !!  జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన జిల్లాగా కృష్ణాజిల్లా ఆవిర్భావం తర్వాత మచిలీపట్నం పోర్టు నిర్మాణం, ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపన ఈ రెండింటి కారణంగా జిల్లాకు ఆర్థిక అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించడం ద్వారా కృష్ణాజిల్లాకు ఒక చురుకైన కదలిక మొదలైందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు విశ్లేషించారు.కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం కరగ్రహారంకు వెళ్లే దారిలో 550 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలను విజయనగరం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తున్న సందర్భంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సంభాషించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో 40 కిలోమీటర్ల వ్యాసార్థం లో నివసిస్తున్న ప్రజలకు ఒక ఆధునిక వైద్య సదుపాయం ఏర్పడినట్లు తెలిపారు. ఈ వైద్యకళాశాల నిర్ణీత సమయానికి నిర్మాణం ఎంతో పటిష్టంగా ఆధునికంగా సౌకర్యవంతంగా మెడికల్ విద్యార్థుల కోసం నిర్మించబడిందన్నారు. వసతి గృహాలు, వివిధ ప్రయోగశాలలు, తరగతి గదులను ఎంతో సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇటువంటి చక్కని వైద్య కళాశాలలో తమకు సీటు లభించడం పట్ల మెడికల్ విద్యార్థిని విద్యార్థులు ఎంతో సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ వైద్య కళాశాల ప్రారంభోత్సవంతో యావత్ కృష్ణా జిల్లా చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు ముఖ్యమంత్రికి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్కె రోజా, మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎం వి. నాగిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక, జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు,అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, పూర్వపు మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, పూర్వపు డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు,తంటిపూడి కవిత నోబుల్, వైద్య కళాశాల పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ గూడవల్లి నాగరాజు, మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, వైయస్సార్సీపి యూత్ జోనల్ ఇంచార్జ్ పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు ),వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమారి, వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్) డాక్టర్ ఆశాలత, వైస్ ప్రిన్సిపాల్ (అకాడమిక్) డాక్టర్ స్వర్ణలత, డిఆర్ఓ వెంకటరమణ, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, ఫార్మకాలజీ అసోసియేటెడ్ ప్రొఫెసర్, బాయ్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ నవీన్, మచిలీపట్నం తహసిల్దార్  విద్య,మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కె. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *