Breaking News

ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి.. సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ అన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శుక్రవారం నగరంలోని క్రీస్తురాజుపురం అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ వద్ద సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఎఎన్‌ఎం, సిహెచ్‌ఓ, ఆశా, వాలంటీర్లు ముగ్గురు చొప్పున బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తారన్నారు. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఈ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష, డా. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల అనారోగ్య సమస్యలను జగనన్న ఆరోగ్య సురక్ష యాప్‌లో నమోదు చేస్తారన్నారు. అలాగే ఏడు రకాల పరీక్షలు బిపి, షుగర్‌, యూరిన్‌, హిమోగ్లోబిన్‌, కళ్లె, డెంగ్యూ, మలేరియా జ్వరాలు, చర్మంపై దీర్ఘకాలిక మచ్చలు తదితర పరీక్షలను నిర్వహించి వాటి వివరాలను యాప్‌లో నమోదు చేసి, హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తారన్నారు. అంతకుముందే తయారైన కేస్‌ షీట్‌ ఆధారంగా, వారికి కేటాయించబడ్డ టోకెన్‌ నంబరును బట్టి, వారిని స్పెషలిస్టుల దగ్గరకు ఆయా పిహెచ్‌సిల వైద్యులు రిఫర్‌ చేస్తారన్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలను ముఖ్యంగా వ్యాధులకు అందించే చికిత్స, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, ఆరోగ్యశ్రీ రిఫరల్‌ ఆసుపత్రులు, వారు అందించాల్సిన సేవలు గురించి వివరించారు. ఏ రకమైన సేవలకు ఏ ఆసుపత్రికి వెళ్లాల్సిందీ, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పజల ఆరోగ్య అవసరాలను గుర్తించి, వారికి కావాల్సిన సేవలను అందించి, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ కోరారు.కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ కో`ఆర్డినేటర్‌ జె. సుమన్‌ సచివాలయ సిబ్బంది, ఆరోగ్యశ్రీ, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *