Breaking News

“అసంఘటిత రంగంలోని కార్మికులకు న్యాయ సేవల పథకం 2015”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు నల్సా వారి “అసంఘటిత రంగంలోని కార్మికులకు న్యాయ సేవల పథకం, 2015” ద్వారా ఈ ఉచిత వైద్య సేవల శిబిరాన్ని నిర్వహిస్తున్నా మని జిల్లా ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత తెలిపారు.శుక్రవారం జాతీయ హరిత ట్రిబ్యునల్ వారి ఆదేశానుసారం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత  పట్టణంలోని పలు రీసైక్లింగ్ కేంద్రాలను సందర్శించారు.ఆ ప్రదేశాలలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం మరియు భద్రతా అవసరాలను గుర్తించి నేడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు రాజమహేంద్రవరం పురపాలక సంఘం వారి సహకారంతో ఉచిత వైద్య సేవల శిబిరం నిర్వహించారు. మన పరిసరాలను, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదకర పరిస్థితులలో పని చేస్తుంటారని, వారి సంక్షేమం కోసం ఈ వైద్య సేవల శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కార్మిక సోదర సోదరీమణులందారు ఈ సేవలను వినియోగించుకోవాలని, విషపూరిత వాయువులు, అపాయకర పరిస్థితుల నడుమ పని చేస్తున్నారు కాబట్టి వారందరూ భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరారు. ఈ వైద్య పరీక్షల ఆధారంగా కళ్ళజోళ్ళ అవసరం ఉన్న వారికి అవి తయారు చేయించి అతిత్వరలో అందజేస్తామని తెలిపారు. అనారోగ్యంగా ఉన్న వారికి వైద్య నిపుణుల సూచనల మేరకు అవసవమైన సహకారాన్ని అందజేస్తామని ఆమె తెలిపారు.పారిశుద్ధ్య రంగంలో పనిచేసే కార్మికుల వారికి ఎటువంటి న్యాయ సమస్యలున్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి సమస్యలను పరిష్కరించు కోవాలని కార్యదర్శి ప్రత్యూష కుమారి తెలిపారు.ఈ వైద్య సేవల శిబిరం నందు ఎం.హెచ్.ఓ డా. వినూత్న పర్యవేక్షణలో రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ పరీక్షలతో పాటు హాజరైన కార్మికులందరికి(వేస్ట్ పిక్కర్స్) కంటి పరీక్షలు జరిగాయి. కార్మికులకు ఏప్రన్లు, గ్లోవ్స్, మస్కూలు, బూట్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర అధికారులు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు వంద మంది వేస్ట్ పిక్కర్స్ పరీక్షలు చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఐ.ఈ.సి. స్పెషలిస్ట్ జె.ఎస్.ఆర్. అన్నమయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్ పి.ఎల్.గణపతి కుమార్, డా. పి.దిలీప్ కృష్ణ, ఆప్తాల్మిక్ అసిస్టెంట్  పి. భాగ్యశ్రీ, ఆర్.ఎం.సి. డివైన్ గ్రూప్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *