-ఈ విద్యా సంవత్సరం 2023-24 నుంచి 150 విద్యార్ధుల మొదటి బ్యాచ్ ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది.
-రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య, ఆరోగ్యానికి పెద్ద పీట వేయడం ఆయన దూరదృష్టి కి నిదర్శనం.
-హోం మంత్రి తానేటి వనిత,
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చూట్టారని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు.శుక్రవారం విజయనగరంలో నూతనంగా వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి, అనంతరం వర్చువల్ విధానం లో రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల లో నూతనముగా నిర్మించిన వైద్య బోధన కళాశాలను ప్రారంభించారు.శుక్రవారం స్థానిక నూతన ప్రభుత్వ వైద్య కళాశాల నుండి రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవి లత, ఎంపీ మార్గాని భరత్ రామ్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డిసిసిబి చైర్మన్ ఆకులు వీర్రాజు , ఎపి గ్రినరీ బ్యూటిఫి కేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ తదితరులు వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి సుమారు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా నేడు విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు మచిలీపట్నం, నంద్యాల లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులను జగనన్న ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలియ చెయ్యడం ఆ దూరదృష్టికి నిదర్శనం గా పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 2023-24 లో ఐదు మెడికల్ కాలేజీల్లో అకడమిక్ తరగతులను ప్రారంభించుకోవడం చరిత్రలో నిలుస్తుందన్నారు. ప్రతి మెడికల్ కాలేజీలో రూ. 500 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచింగ్ హాస్పిటల్, 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ, 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టళ్లు, సిబ్బంది వసతి, క్రీడా ప్రాంగణాలు, అత్యాధునిక సాంకేతికతతో లాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, సీసీ టీవీల ఏర్పాటు ద్వారా ఎంతో ఆధునిక హంగులు కల్పించడం జరిగిందన్నారు.జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు కాగా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. మల్టీ/సూపర్ స్పెషాలిటీ అధునాతన వైద్యసేవలను ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆదిశలో 500 బెడ్స్ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం జరుగుతున్నట్లు కలెక్టర్ వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో మల్టీ/సూపర్ స్పెషాలిటీ అధునాతన వైద్యసేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ధన్యవాదములు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి 500 బెడ్స్ తో ఆధునికరిస్తూ చుట్టుపక్కల జిల్లాల వారికి కూడా ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంత తోడ్పాటును అందించేలా వైద్య సేవలు అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న రాజమహేంద్రవరం ను విద్యా హబ్ గా తీర్చిదిద్దే విధానంలో ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చెయ్యడం పట్ల జిల్లా ప్రజలు తరపున కృతజ్ఞతలు చెపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో జిల్లా కలెక్టర్ తొలి మెడికల్ కాలేజీ ప్రారంభ సమయంలో ఉండడం ఎంతో మంచి అనుభూతికి గురిచేసిందని, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్ ఫిజీషియన్ కాన్సెప్ట్, నేడు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల వద్దకే వైద్య అధికారులు వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటున్నారన్నారు.ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా వేగంగా అడుగులు ముందుకు వేయ్యాడం పట్ల ఎంపి భరత్ రామ్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ ఆసుపత్రి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, కలెక్టర్ డా కె. మాధవీలత, ఎంపి మార్గని భరత్ రామ్, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ఏపి గ్రినరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, స్థానిక ప్రజా ప్రతినిధులు డా శ్రీనివాస్, మెడపాటి షర్మిలా రెడ్డి, ప్రిన్సిపల్ డా బి.సౌభాగ్య లక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, బోధనా సుపత్రి వైద్యులు, ఎన్ మెడికో విద్యార్థులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News