Breaking News

మీరు సీఎంగా ఉంటారు, నేను డాక్టర్‌గా ఉంటాను, ఇద్దరం ప్రజలకు సేవ చేద్దాం

– గగన, వైద్య విద్యార్ధిని, రాజమహేంద్రవరం గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్‌ మార్నింగ్‌ అన్నా, నేను విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం పెద్దసెలగం గ్రామానికి చెందిన అమ్మాయిని, మేం ఎస్టీలం, మా నాన్న దినసరి కూలీ, అమ్మ గృహిణి, నేను చిన్నప్పటి నుంచి సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌లో చదువుకున్నాను.నీకు ఎంబీబీఎస్‌ ఎందుకు, రాదని చాలా మంది చెప్పారు, కానీ మా జగనన్న వల్ల వైద్య విద్యలో ఇన్ని మార్పులు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. ప్రభుత్వ కాలేజ్‌ అంటే ముందు భయపడ్డా కానీ తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యపోయా, అంతా డిజిటలైజేషన్, స్కిల్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి, మాలాంటి పేద, మధ్యతరగతి పిల్లలు వైద్య విద్య చదువుతున్నారంటే మీరే కారణం, మా కుటుంబంలోనే కాదు మా ఊరిలోనే మొదటి డాక్టర్‌ను, నేను ప్రజలకు మంచి సేవలు అందిస్తానని మీకు మాట ఇస్తున్నాను, నవరత్నాల వల్ల కూడా చాలా లబ్ధి జరిగింది మాకు, మీరు వచ్చిన తర్వాత స్కూల్స్‌ చాలా మారిపోయాయి.మీకోసం ఎంత చెప్పినా తక్కువే, మా అమ్మకు క్యాన్సర్, క్రిటికల్‌ స్టేజ్‌ అన్నారు, చాలా ఖర్చవుతుందనుకున్నాం, నమ్మకం కోల్పోయాం, కానీ ఆరోగ్యశ్రీ వల్ల మేం రూపాయి ఖర్చు లేకుండా చికిత్స చేయించాం, మా అమ్మ నన్ను చూస్తుందంటే అందుకు మీరే కారణం. మా కుటుంబం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది.మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుని కులం, మతం, ప్రాంతం చూడకుండా నేను సేవలు అందిస్తాను, మీరు సీఎంగా ఉంటారు, నేను డాక్టర్‌గా ఉంటాను, ఇద్దరం ప్రజలకు సేవ చేద్దాం అన్నా, ధ్యాంక్యూ అన్నా అని తన కృతజ్ఞత వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *