Breaking News

ఇండియన్ స్వచ్చ లీగ్ 2.0లో నగరంలోని విద్యార్ధులు పెద్ద ఎత్తున భాగస్వాములు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ స్వచ్చ లీగ్ 2.0లో నగరంలోని విద్యార్ధులు పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారని నగర కమిషనర్ కీర్తి చేకూరి విభాగాదిపతులను ఆదేశించారు. శుక్రవారం స్వచ్చ సర్వేక్షణ్ 2023లో భాగంగా జరుగుతున్న ఇండియన్ స్వచ్చ లీగ్ 2.0 సేల్ఫీ కార్యక్రమం నగరంలోని పలు విద్యా సంస్థల్లో జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షణ్ లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ స్వచ్చ లీగ్ 2.0 ని https://innovateindia.mygov.in/islseason2/ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. ఇండియన్ స్వచ్చ లీగ్ లో విద్యార్ధులు ఆయా విద్యాసంస్థల్లో డౌన్లోడ్ చేసుకొని సేల్ఫీ దిగి యాప్ లో అప్ లోడ్ చేస్తూ నగరానికి జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంక్ వచ్చేదానిలో భాగస్వాములు అవుతున్నారన్నారు. వార్డ్ సచివాలయాల వారిగా కార్యదర్శులు, నోడల్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని విద్యా సంస్థలు, వాకింగ్ ట్రాక్ ల్లో విద్యార్ధులు, ప్రజలకు స్వచ్చ లీగ్ పై అవగాహన కల్గిస్తున్నారన్నారు. ఈ సేల్ఫీ క్యాంపెయిన్ శని,ఆదివారం కూడా జరుగుతుందన్నారు. ఆదివారం బిఆర్ స్టేడియంలో జరిగే మెగా సేల్ఫీ కార్యక్రమంలో కూడా విద్యార్ధులు, యువత పాల్గొని, గుంటూరు నగర ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరోసారి చాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *