Breaking News

మూడవ రోజు “బాబు తో నేను రిలే నిరాహార దీక్ష”


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు చేసినందుకు పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ నాని  సూచనల మేరకు  టీడీపీ నాయకులు ఎమ్.ఎస్.బేగ్ సారధ్యంలో శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలోని కార్యాలయం వద్ద మూడవ రోజు “బాబు తో నేను రిలే నిరాహార దీక్ష లో” నిరసన దీక్ష చేపట్టారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ అనుమానాలు రేకెత్తిస్తోంది, తప్పు చేశారంటే ఎవరు నమ్మరన్నారు. ఎన్నికలకు ముందు అయన అరెస్ట్ చేయడం అనుమానస్పదంగా ఉన్నట్లు చెప్పారు. గవర్నర్ అనుమతి లేకుండా ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం సబబు కాదన్నారు. లోకేష్ పాదయాత్ర లోను అలజడి సృష్టిoచారు, ప్రతిఘటించిన టీడీపీ వాళ్ళ పై అక్రమ కేసులు పెట్టి వేదీస్తున్నారన్నారు. చంద్రబాబు మచ్చలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం మహిళా సాధికారతకు డ్వాక్రా  గ్రూపుల ప్రారంభించడం, మండల వ్యవస్థను కంప్యూటర్ రైజ్డ్ చేయటం, ఇలా చంద్రబాబు ఎన్నో అభివృద్ధి చేసారన్నారు.
ఎమ్.ఎస్.బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. చంద్రబాబు స్థాపించిన హైటెక్ సిటీ ఇతర ఐటీ కంపెనీల ద్వారా ఉపాధి పొందిన వేలాది మంది ఉద్యోగులు నానక్ రామ్ గూడ  ఐటీ జోన్ లోని విప్రో సర్కిల్ వద్ద కు చేరుకునీ నిరసన తెలపడం చూస్తుంటే ఆయన చరిష్మా ఏంటో తెలుస్తుందన్నారు. దేశ విదేశాల్లో మన ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే ఇది ఆయన విజన్ వల్లే సాధ్యమైందని తెలిపారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే పోరాటం న్యాయానికి అన్యాయానికి జరిగే పోరాటం అన్నారు దీక్ష బయట ఏర్పాటు చేయబడిన నేను సైతం బాబు కోసం అనే సంతకాల సేకరణలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క సంతకాలను చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు లింగమనేని శివరాం ప్రసాద్, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వాసం మునయ్య  రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు sk ఎస్. .కె.  అమానుల్లా, మొహిద్దీన్, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు, జిల్లా కార్యాలయం కార్యదర్శి సారిపల్లి రాధ కృష్ణ, జిల్లా అధికారి ప్రతినిధి బెవర సాయి సుధాకర్, Mcpi (u)జిల్లా కార్య దర్శి sk ఖాదర్ బాషా జిల్లా కమిటీ సభ్యులు.Sk అజాజ్, sd సుభాని sd వాహే ద్ జనసేన రివిజినల్ కోఆర్డినేటర్, మహిళ నాయకురాలు మల్లెపూవిజయలక్ష్మి ప్రధాన కార్యదర్శి ముబీనా ఆకారపు విజయకుమారి, అనిత, టీమ్ టిడిపి కుటుంబం సభ్యులు ఈ దీక్ష కు పెద్ద ఎత్తున తమ మద్దతు తెలియచేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సెప్టెంబర్ 27న రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు:రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దుర్గేష్ కీలక సమీక్ష.. గోదావరి పుష్కరాలు, ఇన్-బౌండ్ టూరిజం వృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *