Breaking News

క్షయ వ్యాధి పై అవగాహనా శిబిరాలు ప్రారంబం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఆటోనగర్ డిస్పోజబుల్ రోడ్డులో నిర్వహించిన క్షయ వ్యాధి అవగాహనా శిబిరాన్ని డాక్టర్ వై. విజయ కృష్ణ, కంన్సల్టెంట్, డబ్ల్యు.హెచ్.ఒ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధిని నిర్మూలించడానికి ప్రతిఒక్కరూ సహాయపడాలని క్షయ వ్యాధి లక్షణాలలో 15రోజులపై నుండి దగ్గు, కళ్ళె/కఫం పడటం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, రోజు సాయంత్రం జ్వరం రావడం ఇలా ఏదైనా ఒక్క లక్షణం ఉన్న అశ్రద్ధ చేయకుండా దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన అన్నారు. పరీక్షలో క్షయ గా నిర్ధారణ అయితే గవర్నమెంట్ వారు అందించే ఉచిత మందులను ఆరు నెలలపాటు తీసుకుంటూ పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటే పూర్తిగా తగ్గుతుందని ఆయన అన్నారు.

అనంతరం వాసవ్య మహిళా మండలి ప్రాజెక్ట్ మేనేజర్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ క్షయవ్యాధి పై అవగాహన కొరకు 15 రోజుల పాటు అవగాహనా శిబిరాలు ఏర్పాటు చేశామని క్షయ వ్యాధి లక్షణాలున్న వారికి ఉచితంగా పరీక్షలు చేయడం, నిర్ధారణ అయిన వారికి చికిత్సను అందివ్వడం ఈ క్యాంపెయిన్
యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.ఉమామహేశ్వరరావు యస్.టి.యస్, వాసవ్య సిబ్బంది సత్యప్రసాద్, మణికంఠ, మహాలక్ష్మి, వీరాంజనేయులు, రాజామోహన్, సాంబశివరావు, శంకర్, రెహమాన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *