విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నిర్వహించబడుతుందని, ప్రతి పౌరుడికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో దినోత్సవం జరపడుతుందని, నేషనల్ సెక్రెటరీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పేరం శివ నాగేశ్వరరావుప్రకటనలో తెలియజేశారు. .సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వ అంశాలు, ప్రజాస్వామ్యం యొక్క అంతర్జాతీయ పరిధిని, ధ్రువీకరించేందుకు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐ సి యు )ఆధ్వర్యంలో 1997 సెప్టెంబర్ 16 ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన సమావేశంలో ప్రజాస్వామ్యంపై సార్వత్రిక ప్రకటన వెలువడిందని ,ఆయన తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ రూపం కలిగించిన, వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని దనిక ,పేద అనే లేకుండా అందరికీ అవకాశం కల్పించినటువంటి” ఓటు “అనే ఒక ఆయుధాన్ని భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక విలువలు తీసుకొచ్చి నటువంటి రోజు ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగ వ్యవస్థ అని అన్నారు. ప్రస్తుతం కుటుంబ పరిపాలన పరిమితం అవుతుందని ప్రతి పౌరులు కూడా రానున్న ఎన్నికల్లో ఎవరు కూడా ఓటును అమ్ముకోవద్దని ,ఓటు ద్వారా మంచి నాయకున్ని పరిపాల దక్షత కలిగినటువంటి నాయకుడిని ఎన్నుకుని భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నానని అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అక్టోబర్ 3 ,1956 లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్థాపించిన రోజు ఐదు లక్షల జనాభాతో ఆయన నాగపూర్ లో పేద ప్రజలకుఅండగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని అన్నారు. హైదరాబాద్ నగరం లో బహిరంగ సభ అక్టోబర్ 3, 2023 ,తేదీన సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ బహిరంగ సభకు కేంద్ర మంత్రివర్యులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు రాందాస్ అధవాలే ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని ఆర్.పి.ఐ నేషనల్ సెక్రెటరీ పేరం శివ నాగేశ్వరరావుఒక ప్రకటనలో తెలియజేశారు.
Prajavartha Online Telugu News