-సీబీఎస్ఈ అమలు విధివిధానాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చ
-విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ పరీక్షా విధానం అనుసంధానించే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, 2025 నాటికి పదో తరగతి పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్ తో విద్యార్థులు పరీక్షలు రాసేలా సన్నద్ధం చేస్తున్నామని, దీనికి ఉపాధ్యాయులు తమవంతు కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ అన్నారు.
శుక్రవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో జరిగిన ‘సీబీఎస్ఈ సిలబస్ అమలు విధానాలపై ప్రాథమిక సమీక్షా సమావేశం’లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇతర విద్యాశాఖా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… సీబీఎస్ఈ పరీక్షా విధానం, అకడమిక్ క్యాలెండర్ (వేసవి సెలవులు), లాంగ్వేజీల ఎంపిక, సబ్జెక్టులతో పాటు రాష్ట్రంలోని సీబీఎస్ఈ అనుసంధానం చేసిన పాఠశాలల్లో, రాష్ట్ర విద్యావిధానం అమలువుతున్న తీరు, దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల గురించి పరస్పర చర్చలు జరిపారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయ యాజమాన్యాలతో కూడా చర్చిస్తామని, అన్ని అంశాలు పరిశీలించాక తుదినిర్ణయం తీసుకుంటామన్నారు.
ఉపాధ్యాయ సంఘాల హర్షం
-ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఐబీ కరికులమ్ దశల వారీగా అమలు పరిచే యోచనలో కూడా ఉన్నామన్నారు.
-8 నుంచి ప్లస్ 2 వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు పీజీటీ గ్రేడ్, ప్లస్ 2 స్కూల్ హెచ్ఎంలకు ప్రిన్సిపాళ్లుగా హోదా మార్పునకు ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News