-ఈ పోర్టల్ లో నమోదై గుర్తింపు కార్డు పొందాలి
-ఇంకా నమోదు కావాల్సిన వారు 2,27,796 మంది
-జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ బి ఎస్ ఎమ్. వలీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ – శ్రమ్ పోర్టల్లో నమోదైన అసంఘటిత కార్మికులు, వలస కార్మికులకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా పలు ప్రయోజనాలను కల్పిస్తు న్నామని జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ బి ఎస్ ఎమ్. వలీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆమేరకు సామాజిక భద్రత సంక్షేమ పథకాల కింద ప్రయోజనాలు అంద జేస్తారన్నారు. ఉపాధిని, నైపుణ్యాభి వృద్ధిని కల్పించేందుకు ఈ డేటాబేస్ ఆధారపడు తుందన్నారు. నమోదు అయిన కార్మికులు ప్రమాద వశాత్తూ మరణించినా, అంగవైకల్యం పొందినా ఎక్స్ గ్రేషియా సొమ్ము కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ సిఫారసుల మేరకు అందజేస్తామన్నారు. నమోదైన వలస కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. తప్పనిసరిగా ఈ శ్రమ్ లో నమోదు చేసుకున్న అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు మాత్రమే ఈ అవకాశం ఉందని పేర్కొన్నారు.
జిల్లాలో గుర్తించిన 5,45, 810 మంది అసంఘటిత కార్మికులలో ఇప్పటి వరకు 3,18, 014 మందిని నమోదు చేశామన్నారు. ఇంకా 2,27,796 మంది వారి వివరాలు ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదు కావలసి ఉన్నట్లు ఆయన తెలియ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ -శ్రమ్ పోర్టల్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ నమోదు చేసుకున్న అసంఘటిత రంగం కు చెందిన వలస కార్మికులు, డొమెస్టిక్ వర్కర్స్, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తి పనివారు, వీధి వ్యాపారులు , ఆశ వర్కర్స్, అంగన్ వాడి వర్కర్స్, మత్స్యకారులు, మొక్కలు పెంచే కూలీలు, ఉపాధి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పాల వ్యాపారులు, కొరియర్ బాయ్స్, లఘు వ్యాపారులు , ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేనివారు, ఆదాయపు పన్ను చెల్లించనివారు, 16-59 సంవత్సరాల వయసు గలవారు అర్హులు అని తెలిపారు. ఈ పోర్టల్ లో నమోదు చేసుకున్న వారికి ఎటువంటి రుసుము చెల్లించకుండానే ప్రధానమంత్రి బీమా యోజన పథకం అమలు చేయడం జరుగుతుందని అన్నారు.
Prajavartha Online Telugu News