Breaking News

పేదల ఆరోగ్యం పట్ల సీఎం జగన్ పెద్ద కొడుకు పాత్ర

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల ఆరోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గిరిపురంలోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాల నందు బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డీఎంహెచ్ఓ సుహాసిని, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్, డిప్యూటీ డీఎంఓహెచ్ ఇందుమతితో కలిసి ఆయన పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పేదల ఆరోగ్యానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలున్న వారికి నయమయ్యే వరకు తోడుగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పుకొచ్చారు. 24వ డివిజన్లోని 92 వ వార్డు సచివాలయ పరిధిలో 958 గృహాలను ఇంటింటీ సర్వే ద్వారా ఆరోగ్య సిబ్బంది సందర్శించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. 2,685 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 506 మందికి టోకెన్లు అందజేసినట్లు వెల్లడించారు. వీరందరికీ 5 దశల్లో ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడంతో పాటు వ్యాధి నయం అయ్యేంతవరకు సరిపడా మందులు పూర్తి ఉచితంగా అందించడం జరుగుతోందన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలందరి హక్కుగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని మల్లాది విష్ణు అన్నారు. మరోవైపు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలోనూ వారానికి రెండు రోజులు సోమ, గురు వారాల్లో ఉదయం 8 గంటలలోపు షుగర్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. కనుక ఆరోగ్యం విషయంలో అలసత్వం, ఆలస్యం తగదని.. ఏ మాత్రం అనారోగ్య లక్షణాలు కనిపించినా వెనకడుగు వేయకుండా వైద్య పరీక్షలు చేయించుకుని ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు, ఆరోగ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

26న విజయవాడలో సీపీఐ రౌండ్ టేబుల్‌కు ఆహ్వానం

-కరువుపై ఐక్య పోరాటాలు -పార్టీలకతీతంగా కేంద్ర, రాష్ట్రాలపై ఒత్తిడి పెంచాలి -ఖరీఫ్ రైతుల ఆందోళనకరం -55 లక్షల ఎకరాల్లో విత్తనాలే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *