Breaking News

ఇప్పుడు చరిత్ర అంటే.. జగన్ పాలనకు ముందు, జగన్ పాలనకు తర్వాత మాత్రమే : హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
‘ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే..’ కార్యక్రమాన్ని కొవ్వూరు నియోజకవర్గంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఘనంగా ప్రారంభించారు. మొదట కొవ్వూరు టౌన్ పరిధిలోని 3వ సచివాలయం పరిధిలో ప్రారంభించిన అనంతరం కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు సచివాలయం-1 పరిధిలో ప్రారంభించారు. ఆయా సచివాలయాల పరిధిలో జగనన్న ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకూ అందించిన డీబీటీ, నాన్ డీబీటీ పథకాల లబ్ధిని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులను ప్రారంభించారు. దొమ్మేరులో మాజీ ఎంపీటీసీ ముదునూరి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే..’ బుక్ లెట్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. జగనన్న మనకి మళ్ళీ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శం అని మాట్లాడ్డం జరిగేదని అంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పేవాళ్లమన్నారు. కానీ జగనన్న పాలన చూసిన తర్వాత వై.ఎస్. జగన్ పాలనకు ముందు, వై.ఎస్. జగన్ పాలనకి తరువాత అని మాట్లాడుకునే విధంగా మన జగనన్న పాలన ఉందన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రోజున మన కుటుంబంలో ఒక ఇంటి పెద్దగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, పిల్లలకు ఒక మేనమామగా ఈ రోజున మన అందరి కుటుంబాలలో కూడా ఇమిడిపోయారని తెలిపారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ప్రజల్ని ఓన్ చేసుకున్నది లేదన్నారు. ప్రజలందరి అవసరాలు కూడా తెలుసుకుని వివిధ సంక్షేమ పథకాల రూపంలో వారికి అందిస్తున్నారన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా తీరుస్తున్నారన్నారు. అందుకే ఇలాంటి పాలన ప్రజలు మళ్లీ పొందాలంటే కచ్చితంగా ఈ రాష్ట్రానికి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్పష్టం చేశారు. అందుకే ఈ విషయాన్ని ‘ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందకు కావాలంటే..’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వాలంటీర్స్, గృహ సారథలు, నాయకులు, కార్యకర్తలు అందరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మళ్లీ మరోసారి ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వాదించాలని హోంమంత్రి తానేటి వనిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *